సర్కారు బడికి సలాం | - | Sakshi
Sakshi News home page

సర్కారు బడికి సలాం

May 13 2026 1:56 AM | Updated on May 13 2026 1:56 AM

● రాష్ట్ర స్థాయిలో మస్కాపూర్‌ పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌కు అరుదైన గౌరవం ● రాష్ట్ర ఉత్తమ పాఠశాలగా గుర్తింపు ● సీఎం చేతులమీదుగా అవార్డు స్వీకరణ బుధవారం శ్రీ 13 శ్రీ మే శ్రీ 2026

న్యూస్‌రీల్‌

నిర్మల్‌

నేటి నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

నిర్మల్‌ రూరల్‌: జిల్లాలో ఇంటర్మీడియట్‌ అడ్వా న్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమై ఈ నెల 19వరకు కొనసాగనున్నా యి. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంట ల వరకు ఫస్టియర్‌, మధ్యాహ్నం 2నుంచి సా యంత్రం 5గంటల వరకు సెకండియర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాలో 12 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేయగా, 2,667 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఫస్టియర్‌లో 2,078 మంది, సెకండియర్‌లో 589 మంది పరీక్షలు రాయనున్నారు. కేంద్రాల వద్ద 144 సె క్షన్‌ ఉంటుందని, ప్రశ్న పత్రాలను ఆయా కేంద్రాలకు సమీప పోలీస్‌స్టేషన్లలో భద్రపరిచామ ని డీఐఈవో పరశురామ్‌ తెలిపారు. పరీక్షల కో సం ఒక్కో ఫ్లయింగ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాల ను నియమించినట్లు పేర్కొన్నారు. పరీక్షాకేంద్రాలను నిరంతరం పర్యవేక్షించనున్నట్లు తెలి పారు. వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, ప్రిన్సిపాల్‌ సంతకం అవసరం లేదని పేర్కొన్నారు. విద్యార్థులు కేంద్రాలకు అ రగంట ముందే చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

ఖానాపూర్‌: మండలంలోని మస్కాపూర్‌ పీఎంశ్రీ జె డ్పీహెచ్‌ఎస్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది. ఉ త్తమ పీఎంశ్రీ పాఠశాలగా ఎంపిక కాగా, సోమవా రం సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రధానోపాధ్యాయుడు జాడీ శ్రీనివాస్‌ అవార్డు అందుకున్నా రు. నాణ్యమైన విద్య, ఆధునిక సౌకర్యాలు, క్రమశి క్షణ, ప్రత్యేక బోధన విధానాలతో ఈ పాఠశాల ప్రై వేట్‌ విద్యాసంస్థలకు దీటుగా నిలిచింది. ప్రస్తుతం పూర్తిగా ఇంగ్లిష్‌ మీడియంలో కొనసాగుతున్న ఇందులో 830మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్ర ధానోపాధ్యాయుడు జాడీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వి ద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఉపాధ్యాయులు సాయంత్రం, సెలవు దినాల్లో ప్ర త్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నారు.

రాష్ట్ర ఉత్తమ పాఠశాలగా ఘనత

పాఠశాలలో విద్యాప్రమాణాలు, క్రమశిక్షణ, వినూ త్న బోధన విధానాలను గుర్తించిన సర్కారు మస్కాపూర్‌ బడిని రాష్ట్ర ఉత్తమ పాఠశాలగా ప్రకటించింది. రూ.లక్ష ప్రోత్సాహక చెక్కు అందజేసింది. అలా గే, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌ రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా ఎంపికై సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం విశేషం.

పాఠశాలలో ప్రవేశాల కోసం పోటీ

పాఠశాలలో ఖగోళ శాస్త్ర ప్రయోగశాల, కంప్యూటర్‌ ల్యాబ్‌, వర్చువల్‌ ల్యాబ్‌, ఆటస్థలం, ఆర్వో వాటర్‌ ప్లాంట్‌ తదితర ఆధునిక సౌకర్యాలున్నాయి. దీంతో అడ్మిషన్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. చదువుతో పాటు విద్యార్థుల మానసిక, శారీరక వికాసానికి కూడా ఉపాధ్యాయులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్ర తిరోజూ ధ్యానం, యోగా, క్రీడల్లో శిక్షణ ఇస్తూ ప్రో త్సహిస్తున్నారు. వెయిట్‌ లిఫ్టింగ్‌, యోగా తదితర క్రీడాంశాల్లో విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థా యిల్లో ప్రతిభ కనబరుస్తున్నారు. దీంతో ఖానాపూర్‌తో పాటు బాసర, జగిత్యాల, మంచిర్యాల తదితర సుదూర ప్రాంతాల నుంచి కూడా తల్లిదండ్రులు తమ పిల్లలను మస్కాపూర్‌ పాఠశాలలో చేర్పించేందుకు చాలా ఆసక్తి చూపుతున్నారు.

గ్రామస్తుల సహకారంతో..

ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు గ్రామస్తులు వలంటీర్లను నియమించి స్థానిక నిధులతో వేతనాలు చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు 145 మంది ఎన్‌ఎంఎస్‌ఎస్‌కు ఎంపికయ్యారు. ఈసారి పదో తరగతిలోనూ వందశాతం ఉత్తీర్ణత సాధించాం. కార్పొరేట్‌ కళాశాలలు, మేధా చారిటబుల్‌ ట్రస్ట్‌ కళాశాలకు పలువురు ఎంపికయ్యారు. ఉపాధ్యాయుల అంకితభావం, గ్రామస్తుల సహకారం, విద్యార్థుల కృషితో ఈ విజయాలు సాధించాం. పాఠశాలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావడంలో గ్రామస్తుల ప్రోత్సాహం ఎంతో ఉంది.

– జాడి శ్రీనివాస్‌, ప్రధానోపాధ్యాయుడు

Advertisement
 
Advertisement
Advertisement