● బల్దియా ఆఫీస్ ఎదుటే బైఠాయింపు
భైంసా: భైంసా మున్సిపల్ ‘కో ఆప్షన్’ ఎన్నికల టెన్షన్ తగ్గడం లేదు. చైర్మన్ తుమోళ్ల దత్తాత్రి, వైస్ చైర్మన్ బీబీ కుతిజ సిద్దిఖి, బీజేపీ, స్వతంత్ర కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన మంగళవారం రెండోరోజుకు చేరింది. ఎట్టి పరిస్థితుల్లో కో ఆప్షన్ ఎన్నిక నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక గత నెలలో నిర్వహించగా గందరగోళ పరిస్థితి నెలకొంది. నలుగురు స భ్యులకు గాను ఒక ఎంఐఎం అభ్యర్థి ఎన్నికయ్యారు. మిగతా మూడు స్థానాలకు మంగళవారం ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఈనెల 7న పాలకవర్గం కో ఆప్షన్ ఎన్నిక నిర్వహించాలని సిద్ధమైంది. కాగా, సోమవారం రాత్రి 10గంటలకు ఎన్నిక నిలిపివేయాలని మున్సిపల్ కమిషనర్ లింగయ్య ఆదేశాలిచ్చారు.
ఎన్నిక వాయిదాపై ఎమ్మెల్యే ఆగ్రహం
కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక వాయిదా వేయడంపై ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆ గ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మున్సిప ల్ కార్యాలయానికి వెళ్లి అక్కడే గేటు వద్ద బైఠాయించిన పాలకవర్గ సభ్యులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళవారం మున్సిపల్ కో ఆప్షన్ ఎ న్నిక నిర్వహించాల్సి ఉండగా సోమవారం రాత్రి 10గంటలకు కమిషనర్ ఆకస్మాత్తుగా వాట్సప్ సందేశం పంపడమేమిటని ప్రశ్నించారు. కో ఆ ప్షన్ ఎన్నిక ఎందుకు వాయిదా వేశారో కమిషన ర్ చెప్పాలన్నారు. అధికారులు ఎంఐఎంకు అ నుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించా రు. కో ఆప్షన్ ఎన్నిక నిర్వహించే వరకు మున్సి పల్ చైర్మన్, కౌన్సిలర్లు బైఠాయిస్తారని, వారికి సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.
భైంసా బంద్
కో ఆప్షన్ ఎన్నిక వాయిదా వేయడంపై మంగళవారం భైంసా బంద్‌కు పిలుపునిచ్చారు. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో భైంసా పోలీసులు మున్సిపల్ కా ర్యాలయంతోపాటు గోల్డ్ మార్కెట్, కుభీర్ చౌర స్తా సమీపంలో బలగాలను మోహరించారు. పాలకవర్గం కొనసాగిస్తున్న నిరసన శిబిరం వద్ద అధికసంఖ్యలో పోలీస్ అధికారులు, సిబ్బంది బందోబస్తులో నిర్వహించారు.
సోషల్ మీడియాలో వైరల్
మరోవైపు మంగళవారం మున్సిపల్ చైర్మన్ తుమోళ్ల దత్తాత్రి ఫోన్‌లో కమిషనర్ లింగయ్యతో మాట్లాడిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కో ఆప్షన్ ఎన్నిక ఎందుకు వాయిదా వేశారని, వాయిదా వేయాలని ఎవరు చెప్పారని చైర్మన్ అడగగా.. ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారని కమిషనర్ చెప్పారు. తనను హైదరాబాద్‌లో సీడీఎంఏ అధికారులు పిలిపించడంతో అక్కడికి వెళ్తున్నానని కమిషనర్ తెలిపారు. దీంతో వెంటనే చైర్మన్ సీడీఎంఏ అధికారులతో మాట్లాడగా తాము కమిషనర్‌ను రమ్మని చెప్పలేదని పేర్కొనంతోపాటు పలు సంభాషణలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పాలకవర్గ సభ్యులను ఇరకాటంలో పెట్టేందుకే ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయంటూ పట్టణ ప్రజలు బాహాటంగానే చర్చిస్తున్నారు. కో ఆప్షన్ ఎన్నిక జరపాలని ఈనెల 7న నిర్ణయించగా 11న రాత్రి 10గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం వెనుక ఎవరున్నారన్నది పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కొంత మంది కౌన్సిలర్లు కో ఆప్షన్ ఎన్నిక వాయిదా వేసిన విషయంపై నిర్మల్‌కు వెళ్లి కలెక్టర్‌ను కలిశారు. ఎన్నిక వాయిదా తదనంతరం జరిగిన పరిణామాలను ఆయనకు వివరించారు.


