నిర్మల్‌చైన్‌గేట్: వడ్లు, మక్కల కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలిగించొద్దని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కొనుగోళ్లపై పలువురు మంత్రులు, సీఎస్ రామకృష్ణారావు, ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. కొనుగోళ్లు వేగవంతంగా పూ ర్తి చేయాలని, హమాలీ లు, గన్నీ సంచులు, ధా న్యం తరలింపునకు లా రీలు, ధాన్యం నిల్వ చే యడానికి తగిన స్థలాల కొరత లేకుండా చూడాలని సూచించారు. ధా న్యం సరఫరాకు అవసరమైతే ట్రాక్టర్లను కూ డా వినియోగించుకోవా లని, తరలింపునకు అ లసత్వం వహించే లారీ ల కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్లు ధా న్యం కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించారు.
సాఫీగా
కొనుగోలు ప్రక్రియ
కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం నుంచి వీసీ లో కలెక్టర్ భవేశ్ మిశ్రా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మక్కలు, వడ్ల కొనుగోలు ప్రక్రియ సాఫీగా పూర్తి చేయాలని సూచించా రు. కేంద్రాల్లో ధాన్యం సంచులు నిల్వ ఉంచరాదని తెలిపారు. ధాన్యం తూకం, తరలింపునకు రైతుల నుంచి డబ్బులు వసూలు చేయరాదని పేర్కొన్నా రు. వీసీలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, పౌర సరఫరాల అధికారి, మేనేజర్ రాజేందర్, సుధాకర్, మార్క్‌ఫెడ్ డీఎం మహేశ్, జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్, డీఆర్డీవో విజయలక్ష్మి తదితరులున్నారు.


