వేసవి శిబిరాలతో పెరగనున్న నైపుణ్యాలు | - | Sakshi
Sakshi News home page

వేసవి శిబిరాలతో పెరగనున్న నైపుణ్యాలు

May 13 2026 1:56 AM | Updated on May 13 2026 1:56 AM

● కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా ● వేసవి శిబిరం సందర్శన ● ధాన్యం కొనుగోలుకు చర్యలు

నిర్మల్‌చైన్‌గేట్‌: వేసవి శిబిరాలతో విద్యార్థుల్లో నైపుణ్యాలు పెరుగుతాయని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జుమ్మెరా త్‌పేట్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసి న వేసవి శిబిరాన్ని సందర్శించారు. పిల్లలతో ము చ్చటించి వారి వివరాలు, జీవిత లక్ష్యాలు తెలుసుకున్నారు. రోజూ క్యాంపునకు రావాలని, ఆటలు, పాటలు, యోగా, డ్యాన్స్‌లో శిక్షణ ఇస్తారని వివరించారు. అనంతరం పదోతరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాన్ని పరి శీలించారు. అధైర్య పడవద్దని, శ్రద్ధగా చదివి ఉత్తీర్ణులు కావాలని, ఎలాంటి సందేహాలున్నా ఉపాధ్యాయుల ద్వారా నివృత్తి చేసుకోవాలని సూచించారు. డీఈవో భోజన్న, డీవైఎస్వో శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారు.

లారీల సేకరణ ప్రక్రియ పరిశీలన

లక్ష్మణచాంద: సోన్‌ మండలం గంజాల్‌ టోల్‌ప్లాజా వద్ద లారీల సేకరణ ప్రక్రియను కలెక్టర్‌ భవేశ్‌ మి శ్రా పరిశీలించారు. లారీ డ్రైవర్లు, యజమానులతో మర్యాద పూర్వకంగా మాట్లాడి ప్రస్తుత పరిస్థితిని వివరించాలని అధికారులకు సూచించారు. కొనుగో లు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పెరగకుండా చూడాలని ఆదేశించారు. ధాన్యం రవాణాలో జాప్యం జరిగితే సహించబోమని హెచ్చరించారు. అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) కిశోర్‌కుమార్‌, ఆర్డీవో రత్నకళ్యా ణి, తహసీల్దార్లు సంతోష్‌, సరిత, శ్రీనివాస్‌, రెవె న్యూ, రవాణా, పోలీస్‌ శాఖల అధికారులున్నారు.

కొనుగోళ్లలో వేగం పెంచాలి

మామడ: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అధికారులకు సూచించారు. మండలంలోని న్యూసాంగ్వి క్రాస్‌రోడ్డు వద్ద రైతులు, అధికారులతో మాట్లాడారు. లారీలు రావడం లేదని, కూలీల కొరతతో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని రైతులు కలెక్టర్‌కు తెలుపగా.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట అడిషనల్‌ కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌, ఆర్డీవో రత్నకళ్యాణి, తహసీల్దార్‌ శ్రీనివాస్‌రావు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement