బాసర: బాసర ట్రిపుల్‌ఐటీలో నిర్వహిస్తున్న విద్యావారోత్సవాలు మంగళవారం రెండోరోజుకు చేరా యి. ఉదయం యోగా శిబిరంలో అధ్యాపకులు, సి బ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథి గా హాజరైన వీసీ గోవర్ధన్ మాట్లాడుతూ.. ఒత్తిడిని అధిగమించి ప్రశాంత జీవనం గడపడానికి ప్రతి ఒ క్కరూ యోగాను నిత్యకృత్యం చేసుకోవాలని సూ చించారు. శిక్షకులు విజయ్‌కుమార్, నాగలక్ష్మి వివి ధ ఆసనాలపై శిక్షణ ఇచ్చారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ పోటీలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమాన్ని రామకృష్ణ, శ్యాంబాబు, రవికిరణ్ త దితరులు నిర్వహించారు. మానసిక ఆరోగ్యకేంద్రం ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో సాంకేతిక యుగంలో పెరుగుతున్న మానసిక సవాళ్లపై చర్చించారు. వక్త శ్రీలక్ష్మి ఒత్తిడి, ఆందోళనను అధిగమించే మా ర్గాలను విద్యార్థులకు వివరించారు. మెకానికల్ ఇంజినీరింగ్ అసోసియేట్ డీన్ డాక్టర్ మహేశ్ ‘జనరేషన్జెడ్ విద్యార్థులకు బోధన‘ అనే అంశంపై ప్రసంగించారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాల పెంపుపై నిపుణుడు శ్రీకాంత్ కుట్ల ఆన్‌లైన్ ద్వారా అవగాహన కల్పించారు. వర్చువల్ ల్యాబ్స్ అనుసంధా నం, ల్యాబ్ మేనేజ్‌మెంట్ భద్రతా ప్రమాణాలపై సి బ్బందికి మార్గనిర్దేశం చేశారు. మేనేజ్‌మెంట్ విభా గం నుంచి డాక్టర్ తీర్థాల నాగసాయికుమార్ ‘పరిశోధనలో ప్రశ్నించే తత్వం’, ఇంగ్లిష్ విభాగం నుంచి డాక్టర్ శ్రవణ్ ‘పరిశోధనలో సాహిత్యం పాత్ర’, తెలుగు విభాగం నుంచి డాక్టర్ రమాదేవి ‘గురువు లక్షణాలు’ అనే అంశాలపై ప్రసంగించారు. ఎడ్యుకేషన్ వీక్ కోఆర్డినేటర్ డాక్టర్ దేవరాజు, అసోసియేట్ డీన్‌లు శేఖర్ శీలం, డాక్టర్ విఠల్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.


