కొనుగోళ్లలో జాప్యంపై అన్నదాతల కన్నెర్ర
మామడ: లారీల కొరత, తూకం వేయడంలో జాప్యం కారణంగా రోజుల తరబడి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉండటంతో ఆగ్ర హించిన రైతులు న్యూసాంగ్వి క్రాస్‌రోడ్డు వద్ద మంగళవారం రాస్తారోకో చేశారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. తా లు పేరిట బస్తాకు 3నుంచి 4కిలోలు కోత వి ధిస్తున్నారని ఆరోపించారు. రైతులు అరగంటకుపైగా నిర్మల్–ఖానాపూర్ జాతీయ రహదారిపై బైఠాయించగా ఇరువైపులా వాహనాలు నిలిచి ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీనివాస్‌రావు ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూ ర్తి చేసి గోదాములకు తరలిస్తామని తెలుపగా రైతులు ఆందోళన విరమించారు.


