మామడ: వేసవి శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వి నియోగం చేసుకోవాలని డీఈవో భోజన్న అన్నారు. మండలంలోని కొరిటికల్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో శిక్షణ శిబిరాన్ని సోమవారం ప్రారంభించారు. శిక్షణ శిబిరంలో యోగా, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, నా యకత్వ లక్షణాలు పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ మోతే రాజ్వేర్, హెచ్‌ఎం వెంకటరమణారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జుమ్మేరాత్ పాఠశాలలో..
నిర్మల్ రూరల్: సమ్మర్ క్యాంపులను విద్యార్థులు వినియోగించుకోవాలని డీఈవో భోజన్న సూచించారు. జిల్లా కేంద్రంలోని జుమ్మేరాత్‌పేట్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సంబర్ క్యాంప్‌ను ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని 10 పీఎంశ్రీ పాఠశాలల్లో సోమవారం శిబిరాలు ప్రారంభించినట్లు తెలిపారు. విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాలను వివరించారు. క్రీడలతో మానసికోల్లాసం పెరుగుతుందని తెలిపారు.


