నిర్మల్‌టౌన్: ఆశ వర్కర్లు తమకు మార్చి, ఏప్రిల్ నెలల పారితోషికాలు ఇవ్వాలని కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ భవేశ్‌మిశ్రాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆశ వర్కర్లకు ప్రతినెలా ఒకటో తేదీన పారితోషికాలు చెల్లించాలని కోరారు. రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన రూ.1,500 పారితోషికాలను వెంటనే అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధ)జిల్లా ఉపాధ్యక్షురాలు చంద్రకళ, సుగుణ, జిల్లా సహాయ కార్యదర్శి రామలక్ష్మి, కమిటీ సభ్యులు అనసూర్య, భాగ్య, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.


