న్యూస్‌రీల్
అనారోగ్యం పాలైనప్పుడు రక్తసంబంధీకులే దరిచేరని రోజులివీ. ఆస్పత్రిలో ఉన్నప్పుడు వచ్చి ప్రేమగా పలకరించేందుకూ మనసురాని కుటుంబ సభ్యులున్న సమాజమిది. కానీ, ఏ సంబంధం లేకపోయినా.. ఆస్పత్రిలో అచేతన స్థితిలో ఉన్నవారికి సపర్యలు చేస్తారు. అవసాన దశలో ఉన్నా మేమున్నామని.. మీకేం కాదని భరోసా ఇస్తారు. చిరునవ్వుతో దేవదూతల్లా ధైర్యం చెబుతారు. నేడు నర్సింగ్ డే సందర్భంగా కథనం. – నిర్మల్‌చైన్‌గేట్
అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి
నిర్మల్‌టౌన్: అర్జీదారుల నుంచి వచ్చిన సమస్యను పోలీస్ అధికారులు వెంటనే పరిష్కరించాలని, సామాన్యులకు అండగా పోలీసులు ఉండాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నట్లుగా అనారోగ్యం బారినపడి ఆస్పత్రుల్లో చేరిన వారిని అమ్మ కన్నా మిన్నగా నర్సులు చూసుకుంటున్నారు. తెల్లని దుస్తుల్లో మిలమిలా మెరుస్తూ, చిరునవ్వులు చిందిస్తూ వారు అందించే సేవలు నిరుపమానం. రోగి అవసరం ఏదైనా చిటికెలో తీర్చడమో, తీర్చేందుకు ప్రయత్నించడమో చేస్తూ పేషెంట్లకు భరోసా కల్పిస్తారు. రోగుల పాలిట దైవాలుగా నిలుస్తున్నారు నర్సులు.
కుటుంబసభ్యులు చేయలేని సేవలు..
రోగంతో బాధపడుతూ, ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఆస్పత్రుల్లో చేరిన వారికి మేమున్నామని ఆదరణ, ఆప్యాయతతో ధైర్యం చెప్పే వారే నర్సులు. కుటుంబసభ్యులు కూడా చేయలేని సేవలను ఆస్పత్రుల్లో రోగులకు నర్సులు చేస్తున్నారు. అపస్మారక స్థితిలో వైద్యం అందుకుంటున్న వారిని కూడా నర్సులు ప్రేమగా చూసుకుంటున్నారు. జిల్లాలో ఏళ్లుగా నర్సింగ్ వృత్తిలో తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న కొందరి నర్సుల అభిప్రాయాలు వారి మాటల్లో..


