మస్కాపూర్‌ పాఠశాలకు రాష్ట్రస్థాయి గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

మస్కాపూర్‌ పాఠశాలకు రాష్ట్రస్థాయి గుర్తింపు

May 12 2026 12:08 AM | Updated on May 12 2026 12:08 AM

● ఉత్తమ హెచ్‌ఎంగా పురస్కారం అందుకున్న జాడి శ్రీనివాస్‌

ఖానాపూర్‌: మండలంలోని మస్కాపూర్‌ పాఠశాల కు రాష్ట్రస్థాయి గుర్తింపు దక్కింది. రాష్ట్ర ఉత్తమ పీ ఎంశ్రీ పాఠశాలగా ప్రకటించగా, పాఠశాల ప్రధానో పాధ్యాయులు జాడి శ్రీనివాస్‌ రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. హైదరాబాద్‌ రవీంద్రబారతిలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల హెచ్‌ఎం శ్రీనివాస్‌ ఉత్తమ పురస్కారం అందుకున్నారు. జాడి శ్రీనివాస్‌ సారథ్యంలో పాఠశాలలో విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షల్లో విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనబర్చారు. బాసర ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాల్లో మస్కాపూర్‌ పాఠశాల విద్యార్థులకు సీట్లు దక్కాయి. గణిత ఒలింపియాడ్‌లో విద్యార్థులను రాష్ట్రస్థాయిలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంలో ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు.

Advertisement
 
Advertisement
Advertisement