సమ్మర్‌ సెలవులు.. సృజనకు నెలవు | - | Sakshi
Sakshi News home page

సమ్మర్‌ సెలవులు.. సృజనకు నెలవు

May 12 2026 12:08 AM | Updated on May 12 2026 12:08 AM

● సైన్స్‌ శిబిరంలో నూతన ఆవిష్కరణలు ● ముగిసిన వేసవి శిక్షణ శిబిరం ● ఈ నెల 25 వరకు నిర్వహణ ● జిల్లాలోని 16 స్కూళ్లలో విద్యార్థులకు శిక్షణ ● ఒక్కో పాఠశాలకు రూ.50 వేలు మంజూరు

పీఎంశ్రీ బడుల్లో సమ్మర్‌ క్యాంపు షురూ

మంచిర్యాలఅర్బన్‌: జిల్లాలోని పీఎంశ్రీ సర్కారు పాఠశాలల్లో సోమవారం నుంచి సమ్మర్‌ క్యాంపులు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు వేసవి సెలవులు సద్వినియోగం చేసుకుని వివిధ కార్యక్రమాల్లో రాణించేలా శిబిరంలో శిక్షణ ఇస్తారు. జిల్లాలోని 16 పీఎంశ్రీ పాఠశాలల్లో 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు విద్యతో పాటు సృజనాత్మకత, కళలు, క్రీడలు, జీవన నైపుణ్యాలు నేర్పిస్తారు. ఒక్కో పాఠశాలకు రూ.50వేల చొప్పున నిధులు మంజూరయ్యాయి. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనంతో పాటు రవాణా భత్యం ఇవ్వనున్నారు. ఆర్ట్‌ అండ్‌ క్రాప్ట్‌, యోగా, ధ్యానం, చెస్‌, డ్యాన్స్‌, ఇండోర్‌ గేమ్స్‌, గణితం, స్పోకెన్‌ ఇంగ్లిష్‌, సైన్స్‌ ప్రయోగాలతో పాటు పలు అంశాలపై తర్ఫీదు ఇవ్వనున్నారు.

అట్టహాసంగా ప్రారంభం

జిల్లా కేంద్రంలోని టీజీఎంఎస్‌లో సోమవారం సమ్మర్‌ క్యాంపు అట్టహాసంగా ప్రారంభమైంది. ఎంఈవో మాలవీదేవి శిబిరాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌, యోగాతో పాటు కంప్యూటర్‌ బేసిక్‌ అంశాలపై ఇచ్చే శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్‌ సత్తయ్య, పాఠశాల ప్రిన్సిపాల్‌ బుచ్చన్న, విద్యార్థులు పాల్గొన్నారు.

జిల్లా కేంద్రంలోని మంచిర్యాల సైన్స్‌ సెంటర్‌లో 15 రోజుల పాటు నిర్వహించిన సమ్మర్‌ క్యాంపును విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నారు. విభిన్న రకాల్లో ఎక్స్‌పర్మెంట్స్‌ చేసి సైన్స్‌ విజ్ఞానంపై ప్రత్యేకమైన ఆసక్తి పెంచుకున్నారు. ఉపాధ్యాయులు, ట్రైనర్లు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో బోధించారు. సమ్మర్‌ క్యాంపులో కొత్త స్నేహితులను కలుసుకున్నారు. జట్టు భావన పెరిగింది. భవిష్యత్‌లో నూతన ఆవిష్కరణలు చేసి మంచి శాస్త్రవేత్తగా ఎదుగుతామన్న నమ్మకం వారిలో కలిగింది. సమ్మర్‌ సైన్స్‌ క్యాంపు ముగిసిన నేపథ్యంలో విద్యార్థులు నేర్చుకున్న అంశాలు వారి మాటల్లోనే.. – మంచిర్యాలఅర్బన్‌

Advertisement
 
Advertisement
Advertisement