శరీరం గొప్పతనం తెలుసుకున్నా.. | - | Sakshi
Sakshi News home page

శరీరం గొప్పతనం తెలుసుకున్నా..

May 12 2026 12:08 AM | Updated on May 12 2026 12:08 AM

మానవ శరీర అవయవాల పనితీరు గురించి మేక ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలు తీసుకువచ్చి ప్రత్యక్షంగా చూపించారు. మానవుని అవయవాలు ఈవిధంగా ఉంటాయని తెలుసుకున్నాం. గుండెలో ఉండే గదులు, రక్తం పంపింగ్‌ చేసే విధానాన్ని ఉపాధ్యాయుడు నాగవర్మ చూపించారు. మూత్రం ఫిల్టర్‌ ఎలా అవుతుందో తెలిసి పోయింది. మానవ శరీరం గొప్పతనం తెలుసుకున్నాం.

– ఎం.అనీష్‌, పదోతరగతి, మంచిర్యాల

కిరణ చిత్రాలు గీయించారు

ముందు తరగతుల్లో సై న్స్‌ నేర్చుకునేలా తర్ఫీదు ఇచ్చారు. సమతల దర్ప ణం, గోళాకార దర్పణా లను ఉపయోగించి కాంతి ధర్మాలైన పరావర్తనా న్ని వక్రీభవనాన్ని వివరించారు. మాతో కిరణ చిత్రాలు గీయించారు. ప్రతిబింబాలు ఎలా ఏర్పడుతాయో ప్రయోగపూర్వకంగా చూశాం. వక్రీభవన గుణకం వల్ల కొన్ని వస్తువులు ఒకదాంట్లో మరొకటి ముంచినప్పుడు కనిపించక పోవటానికి కారణం తెలుసుకున్నా.

– యోగేశ్వర్‌, దోనబండ జెడ్పీహెచ్‌ఎస్‌

Advertisement
 
Advertisement
Advertisement