చెరువులో మునిగి ఇద్దరు బాలురు మృతి | - | Sakshi
Sakshi News home page

చెరువులో మునిగి ఇద్దరు బాలురు మృతి

May 12 2026 12:08 AM | Updated on May 12 2026 12:08 AM

ముధోల్‌: ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలిగొంది. సరదాకు చెరువులో ఈతకొట్టేందుకు వెళ్లిన ఇద్ద రు బాలురు నీటమునిగి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై బిట్లా పెర్సిస్‌ తెలిపిన వివరాల ప్రకారం... తానూర్‌ మండలం కోలూర్‌ గ్రామానికి చెందిన నిఖిల్‌ (15), మ హారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాకు చెందిన స్వరాజ్‌ (15) వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఊరైన విఠోలి గ్రామానికి వచ్చారు. సోమవారం ఉదయం ఇద్దరూ కలిసి చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. గమనించిన గ్రామస్తులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రా మస్తుల సహాయంతో మృతదేహాలను బయటకు తీ యించారు. పంచనామా అనంతరం భైంసా ఏరి యా ఆస్పత్రికి తరలించారు. నిఖిల్‌ తల్లి ఇచ్చిన ఫి ర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

కేకే 5 గనిలో కేబుల్‌ చోరీ

మందమర్రిరూరల్‌: మందమర్రి ఏరియాలోని కేకే 5 గనిలో విలువైన కేబుల్‌ చోరీకి గురైనట్లు ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్‌ నగునూరి రవి తెలిపారు. సోమవారం తెల్లవారుజామున ఏడుగురు దొంగలు గని ఆవరణలో ఉన్న 10 మీటర్ల కేబుల్‌ను ఎత్తుకెళ్లారు. సెక్యూరిటీ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించగా సీసీ పుటేజీ పరిశీలించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

భీమిని: మండలంలోని పెద్దపేటలో సోమవారం అరికిల విజయకు చెందిన ఇల్లు విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో దగ్ధమైంది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు సోమవారం విజయ బంధువుల ఇంటికి వెళ్లగా ఆమె కుమారులు శ్రీకాంత్‌, శ్రీనాథ్‌ బెల్లంపల్లికి వెళ్లారు. ఇంట్లో ఎవరూలేని సమయంలో షార్ట్‌సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనలో ఇంటి నిర్మాణం కోసం చేను అమ్మగా వచ్చిన రూ.12 లక్షల నగదు, తులం బంగారం, స్టడీ సర్టిఫికెట్లు, నిత్యావసరాలు, సా మగ్రి దగ్ధమయ్యాయి. తమను ఆదుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది.

స్వరాజ్‌ మృతదేహం

నిఖిల్‌ మృతదేహం

Advertisement
 
Advertisement
Advertisement