ఉట్నూర్‌రూరల్: గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి వ చ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకో వాలని ఐటీడీఏ పీవో మంద మకరందు అధి కారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి వి విధ మండలాల నుండి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. నార్నూర్ మండలం జాండా గ్రామానికి చెందిన మడావి హ ను ఆ ర్థికసాయం మంజూరు చేయాలని, ఇంద్రవెల్లి మండలం వాల్గొండకు చెందిన కనక చందు వ్య వసాయ క్షేత్రానికి బోర్‌వెల్ మంజూరు చేయాలని, ఇచ్చోడ మండలం నర్సాపూర్‌కు చెందిన శ్రీదేవి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చే యాలని, తిర్యాణి మండలం మార్కగూడకు చెందిన గోదావరి ఉపాధి కల్పించాలని అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.


