భైంసా: పట్టణ పరిధిలోని దాబాలు, లాడ్జీల్లో ఏఎస్పీ సాయికిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించా రు. దాబాలు, లాడ్జీలకు వచ్చేవారి వివరాలు స రిగా నమోదు చేస్తున్నారా? లేదా? అని తెలు సుకున్నారు. లాడ్జీలు, దాబాల్లో భద్రతా ప్రమాణాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించిన అధి కారులు సీసీ కెమెరాలు సరిగా ఏర్పాటు చేశారా? అవి పనిచేస్తున్నాయా? అనే విషయాలపై ఆరా తీశారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపి స్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నిర్వాహకులకు సూచించారు. ప్రజల భద్రత ను దృష్టిలో ఉంచుకుని దాబా, లాడ్జిలో నాణ్య మైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఏఎస్పీ సాయికిరణ్ సూచించారు. తనిఖీల్లో సీఐ సాయికుమార్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.


