నిర్మల్‌టౌన్: లంబాడా హక్కుల పోరాట సమి తి విద్యార్థి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా భూక్యా రమేశ్ ఎన్నికయ్యారు. ఆదివారం రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని ఐబీ భవనంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాదవ్ అశోక్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని గిరిజన యువత, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. సమాజ హక్కుల పరిరక్షణ, విద్య, ఉపాధి అవకాశాల కోసం నిరంతరం పని చేస్తామని పేర్కొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జాగేందర్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రోహిదాస్ తదితరులు పాల్గొన్నారు.


