పెద్దరోడ్లు.. పెంచేదెప్పుడో! | - | Sakshi
Sakshi News home page

పెద్దరోడ్లు.. పెంచేదెప్పుడో!

May 11 2026 9:31 AM | Updated on May 11 2026 9:31 AM

సోమవారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2026 8లోu

న్యూస్‌రీల్‌

నిర్మల్‌

బాసర క్షేత్రానికి కొత్తశోభ

బాసర సరస్వతీ ఆలయం అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకోనుంది. రూ.225 కోట్లతో మాస్టర్‌ప్లాన్‌ అమలుకు అధికారులు క్షేత్రాన్ని పరిశీలించారు.

గజ్జలమ్మా.. దీవించమ్మా..

కుంటాల: కుంటాల ఇలవేల్పు గజ్జలమ్మ ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. అ ర్చకుడు శ్రీకాంత్‌ రామానుజదాస్‌ ఆధ్వర్యంలో గజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మీ అమ్మవా ర్లకు అలంకరణ, అభిషేకం, అర్చన, హారతి, పల్లకీసేవ నిర్వహించారు. భక్తులు అమ్మవార్ల కు బోనాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయకమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేశారు.

సమయం.. సగం తగ్గుతుంది

నిర్మల్‌: జిల్లా నుంచి ఎటు వెళ్లాలన్నా.. రోడ్డు మార్గ మే దిక్కు. దశాబ్దాలు గడిచిపోతున్నా రైలు మనవైపు రావడం లేదు. ఇప్పట్లో వస్తుందన్న ఆశలూ జిల్లావాసుల్లో లేవు. ఇక ఉన్న జాతీయ రహదారులనైనా విస్తరిస్తే.. కాస్తయినా దూరభారం, సమయం తగ్గుతుందని ఎప్పటి నుంచో జిల్లావాసులు అడుగుతున్నారు. కానీ.. ఈ దిశగా దృష్టిపెట్టి, జిల్లావాసుల కష్టాలను తీర్చాలన్న పట్టింపు స్థానిక నేతల్లో కని పించడం లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆది వారం తన పర్యటనలో పలు అభివృద్ధి పనుల కో సం రూ.9,377కోట్లు కేటాయించారు. ఇందులో జి ల్లా వైపు ఒక్కరూపాయి కూడా రాలేదు. రైల్వేలైన్‌తో పాటు నేషనల్‌ హైవేల విస్తరణ కూడా పెండింగ్‌లోనే పెట్టారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు ఈ దిశగా దృష్టి పెట్టకపోవడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురాకపోవడంతోనే అభివృద్ధి ‘ఆలస్యం’ అవుతోందన్న భావన జిల్లావాసుల్లో నెలకొంది.

దేశంలోనే పెద్ద రోడ్డు

ఎన్‌హెచ్‌ 44.. ఇది దేశంలోనే అత్యంత పొడవైన రోడ్డు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు 4,112 కిలో మీటర్ల పొడవుతో దేశం ఆ చివర, ఈ చివరను కలుపుతోంది. ఇలాంటి ప్రతిష్టాత్మక జాతీయరహదారి జిల్లా మీదుగా వెళ్తోంది. సోన్‌ మండలకేంద్రం నుంచి మామడ మండలంలోని తాండ్ర గ్రామం వరకు దాదాపు 30కిలోమీటర్ల పొడవునా జిల్లా మీదుగా సాగుతోంది. దశాబ్దం క్రితం ఫోర్‌లేన్‌గా మారిన ఈ రోడ్డు పైనుంచి నిత్యం వందలాది భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రోజురోజుకూ వాహనాల రద్దీ పెరుగుతూనే ఉంది. దేశంలోనే చాలా హైవేలను ఆరులేన్లు, ఎనిమిదిలేన్లుగా మా ర్చిన కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ జాతీయ రహదారిని మాత్రం ఇప్పటికీ విస్తరించడం లేదు. దీంతో చాలాచోట్ల తరచూ రోడ్డు ప్ర మాదాలు చోటుచేసుకుంటున్నాయి. వాహనాల ర ద్దీ కారణంగా ప్రయాణికులు గమ్యానికి చేరుకో వాలంటే అధిక సమయం పడుతోంది.

పెండింగ్‌లో ఎన్‌హెచ్‌ 61 విస్తరణ

జిల్లా మీదుగా వెళ్తున్న మరో హైవే 61జాతీయ రహదారి. మొదట మహారాష్ట్రలోని కల్యాణ్‌ నుంచి నిర్మల్‌ వరకు ఉన్న ఈ మార్గాన్ని జగిత్యాల వరకు పొడిగించారు. మహారాష్ట్ర–తెలంగాణ మధ్య వాణిజ్య, బంధుత్వాలకు ప్రధాన మార్గమిది. జిల్లాలో తానూరు మండలం బెల్తరోడ నుంచి ఖానాపూర్‌ మండలం వరకు బాదన్‌కుర్తి వరకు దాదాపు 90కిలో మీటర్లు సాగుతోంది. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ రెండులేన్లుగానే ఉంది. ఇటీవలే నిర్మల్‌–ఖానాపూర్‌ మధ్యలో రోడ్డును అభివృద్ధి చేశారు. ఇదే క్రమంలో ఈ రోడ్డు మొత్తం కనీసం ఫోర్‌లేన్‌గా మార్చాల్సిందని జిల్లావాసులు పేర్కొంటున్నారు.

సర్వే కోసం సమాయత్తం

జిల్లా మీదుగా వెళ్తున్న 61వ జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన సర్వే నిర్వహణ కు కన్సల్టెన్సీలను ఎంపిక చేసేందుకు త్వరలోనే టెండర్‌ పూర్తికానుంది. – సుభాష్‌, డీఈఈ

మహోర్‌ వరకు పొడిగించాలని..

జిల్లాలో ఈ మధ్యకాలంలో కొత్తగా అడుగుపెట్టిన హైవే 161బీబీ. మహారాష్ట్ర సరిహద్దు గుండా మద్నూర్‌–బోధన్‌–బాసర మీదుగా భైంసా వరకు సాగుతుంది. ఈ హైవేను కూడా మొత్తం ఫోర్‌లేన్‌గా మార్చాలని ఇటీవల ముధోల్‌ ఎమ్మెల్యే రామారావుపటేల్‌ కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీని కలిసి కోరారు. అలాగే, ఈ హైవేను భైంసా నుంచి మహారాష్ట్రలోని ప్రసిద్ధక్షేత్రం మహోర్‌ వరకు పొడిగించాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ పొడిగింపుతో బాసర–మహోర్‌ ఆధ్యాత్మిక కారిడార్‌ అవుతుందని స్థానికుల భావన.

నాగ్‌పూర్‌–ముంబై మధ్య బాలాసాహెబ్‌ థాక్రే సమృద్ధి మహామార్గ్‌ పేరిట 701కిలో మీటర్ల పొడవైన ఎనిమిదిలేన్ల ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మించారు. ఈ హైవే నిర్మాణంతో ఇంత దూరాన్ని 8గంటల్లోనే పూర్తిచేస్తున్నారు. అదే నిర్మల్‌ నుంచి హైదరాబాద్‌కు 217కిలో మీటర్లు మాత్రమే. కానీ, ఎన్‌హెచ్‌ 44 ఫోర్‌లేన్‌ కావడం, వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ దూరాన్ని పూర్తిచేయడానికి దాదాపు నాలుగున్నర గంటలు పడుతోంది. అదే ఎనిమిది లేన్ల మార్గమైతే.. రెండున్నర గంటల్లోనే నిర్మల్‌ నుంచి హైదరాబాద్‌కు చేరుకోవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement