ఖానాపూర్: మండలంలోని గోడలపంపు గ్రామ ఎస్సీ కాలనీలో పోచమ్మ విగ్రహ ప్రతి ష్ఠాపనోత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. కాలనీ వాసులు సదరు బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి పూజలు చేశారు. బోనా లు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా పోతరాజుల విన్యాసాలు, సంప్రదాయ ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
భైంసా మండలంలో పేండ్‌పెల్లిలో..
భైంసారూరల్: మండలంలోని పేండ్‌పెల్లి గ్రామంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించగా భక్తులు అధికసంఖ్యలో హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే విఠల్‌రె డ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. హనుమాన్ స్వా మి విగ్రహాన్ని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా పల్లకిలో ఊరేగింపుగా తీసుకువచ్చారు. దారి పొడవునా జై శ్రీరామ్, జైహనుమాన్ నినాదాలు మార్మోగాయి. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో హనుమా న్ దీక్షాపరులు భక్తి గీతాలు ఆలపించారు. సర్పంచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


