వాతావరణం | - | Sakshi
Sakshi News home page

వాతావరణం

May 11 2026 9:31 AM | Updated on May 11 2026 9:31 AM

వాతావరణం

ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఆకాశం వైవిధ్యంగా మేఘావృతమవుతుంది. వాతావరణం పొడిగా ఉంటుంది. ఉక్కపోత పెరుగుతుంది.

అకాల వర్షం..

తడిసిన ధాన్యం

ఖానాపూర్‌: ఖానాపూర్‌ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డుతో పాటు మండలంలోని తర్లపాడ్‌, సత్తెనపల్లి, మస్కాపూర్‌, బాదన్‌కుర్తి, మేడంపల్లి తదితర గ్రామాల్లో పీఏసీఎస్‌, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబెట్టిన వరి ధాన్యం అకాల వర్షానికి స్వల్పంగా తడిసింది. ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో పలుచోట్ల వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ పేరిట అధికారులు కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే ధాన్యాన్ని తూకం చేసి లారీల్లో మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

బస్సు పునఃప్రారంభించాలి

కడెం: కడెం–హైదరాబాద్‌ ఉదయం బస్సు ను పునఃప్రారంభించాలని ప్లబిక్‌ ప్రిఫర్‌ పీస్‌ కో–ఆర్డినేటర్‌, న్యాయవాది నేదూరి లలితకుమారి, అడ్వైజర్‌ నేదూరి జాకబ్‌ విజ్ఞప్తి చేశారు. ఆదివారం నిర్మల్‌ బస్టాండ్‌లో ఆర్టీసీ అధికారులకు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. కడెం–హైదరాబాద్‌ బస్సుతో కడెం ప్రాంతవాసులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. వుల్లెంగుల రమేశ్‌ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement