నార్నూర్: మండలంలోని మల్లంగి ఎస్సీగూడ గ్రా మంలో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఎస్సై ఎస్. శ్రీసాయి తెలి పిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చలక్క ర్ జయరాం తన ఇంటి పెరట్లో గంజాయి సా గు చేస్తున్నాడనే సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఇంటి పరిసరాల్లో 5 గంజాయి మొక్కలతో పాటు 700 గ్రాముల ఎండిన గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో ఇప్పటివరకు 50 గంజాయి కేసులు నమోదు చేసినట్లు పో లీసులు వెల్లడించారు. 15 కిలోల ఎండు గంజా యి, 638 గంజాయి మొక్కలను స్వాధీనం చే సుకున్నామని, 103 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.67 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.


