చెరువులో దూకి యువకుడు.. | - | Sakshi
Sakshi News home page

చెరువులో దూకి యువకుడు..

May 11 2026 9:31 AM | Updated on May 11 2026 9:31 AM

బాసర: తాగుడుకు బానిసై న యువకుడు ఆది వారం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘ టన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం.. మైలాపూర్‌ గ్రామానికి చెందిన సంగం రాజు (18) గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది, గ్రామ సమీపంలోని చె రువులో దూకి బలవన్మరణా నికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న సీఐ కిరణ్‌ వెంటనే సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమి త్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి సంగం పోసాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement