బయట ఎండలు.. ఇంట్లోనే ఆటలు | - | Sakshi
Sakshi News home page

బయట ఎండలు.. ఇంట్లోనే ఆటలు

May 11 2026 9:31 AM | Updated on May 11 2026 9:31 AM

భలే భలే.. బొమ్మ ట్రాక్టర్‌

బొమ్మట్రాక్టర్‌తో ఆడుతున్న బాలుడు

బండాట ఆడుతున్న చిన్నారులు

దండేపల్లి: వేసవిలో ఎండను సైతం లెక్కచేయకుండా చిన్నారులు ఆటలు ఆడుతుంటారు. పెద్దలు ఇళ్లల్లో చేసే పనులను అనుకరించి ఆటలు ఆడుతుంటారు. వంటింట్లో చేసే పనులను పిల్లలు దండేపల్లి ఇంటి ఆవరణలో అన్నం, కూర ఆట ఆడుతుండగా ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది.

చెన్నూర్‌: వేసవికాలం వచ్చిందంటే చాలు చిన్నారులు ఆటల్లో నిమగ్నమవుతారు. నలుగురు పిల్లలు ఒకేచోట చేరితే వారికి నచ్చిన ఆటలు ఆడుతూ ఆనందిస్తుంటారు. చిన్న మట్టికుండ ఆకారం ఉండే గురిగేలో మట్టి పోసి మరో డబ్బాతో మట్టి కొలిచే ఆట ఆడుతున్నారు. దీన్నే మట్టిలో గురిగే అంటారు. చెన్నూర్‌లోని బట్టిగూడెం కాలనీలో చిన్నారులు ఈ ఆట ఆడుతూ కనిపించారు.

బండాట

మట్టిలో గురిగే ఆటలు

చెన్నూర్‌రూరల్‌: వేసవి సెలవుల్లో చిన్నారులు ఎంజాయ్‌ చేస్తున్నారు. కొందరు సెల్‌ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతున్నారు. మరికొందరు చెట్లనీడన, ఇంటి పట్టున బండాట ఆడుతున్నారు. చెన్నూర్‌ మండలం శివలింగాపూర్‌ వద్ద ఇద్దరు చిన్నారులు ఒక పెట్టెకు తాడు కట్టి ఒకరు అందులో కూర్చోగా మరొకరు తాడుతో లాగుతూ ఆడుకుంటున్నారు.

దండేపల్లి: వేసవి వచ్చిందంటే చాలు..పిల్లల లోకమే వేరు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, ఇంటి ఆవరణలే వా రికి ఆటస్థలాలు. దండేపల్లిలోని ఓ వీధిలో బాలుడు బొ మ్మ ట్రాక్టర్‌కు తాడు కట్టి అటు, ఇటు నడిపిస్తూ ఆడుకుంటూ కనిపించాడు. పెద్ద ట్రాక్టర్లతో చేసే పనులను పి ల్లలు తమ ఆటల్లో అనుకరిస్తూ ఆడుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు.

అన్నం, కూర ఆట..

ఎండలు మండిపోతుండటంతో మైదానాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. వేసవి సెలవుల్లో పిల్లలు నీడపట్టున ఉండి ఆటలు ఆడుతున్నారు. ఇంట్లో ఆడుకునే క్యారం, చెస్‌, అష్టాచెమ్మా తదితర ఆటలు ఆడుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు. పిల్లలు ఎండ సమయంలో ఇంట్లోనే ఆడుతూ, ఇంటినే ఒక స్టేడియంలా మార్చేస్తున్నారు. సెల్‌ ఫోన్లకు దూరంగా, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆడుతున్న ఈ ఆటలు చిన్నారుల మేధస్సుకు పదును పెట్టడమే కాకుండా, ఎండలో తిరగకుండా వారిని నివారిస్తున్నాయి. – దండేపల్లి

Advertisement
 
Advertisement
Advertisement