జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు ఎన్నో పతకాలు, ప్రశంసాపత్రాలు నేడు వాటర్ ర్యాప్లింగ్ దినోత్సవం
2014లో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గాయత్రి జలపాతంలో జరిగిన సాహస క్రీడల్లో విజేతగా నిలిచింది.
2016లో నిజామాబాద్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి సాహస క్రీడల్లో ప్రథమ స్థానం పొందింది. 2019లో ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వతరోహణ భగీరథ –2లో జాతీయ పతకాన్ని ఎగురవేసింది. హిమాలయ పర్వతారోహణ చేసి విజయం సాధించింది.
2026 జనవరి 11 నుంచి 14 వరకు విశాఖపట్టణంలో కొనసాగిన ర్యాప్లింగ్ పోటీల్లో రెండో స్థానం సాధించింది. ఈ పోటీల్లో 18 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. అరకులోని కటక జలపాతంలో 400 మీటర్ల అడుగుకు 2.35 నిమిషాల్లో చేరి అందరి మన్ననలు పొందింది.
2020 జనవరి 7న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ అరకులోయలో కటిక జలపాతంలో జరిగిన రెండోప్రపంచ స్థాయి వాటర్ ర్యాప్లింగ్ పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు వితేతగా నిలిచారు. కన్నిబాయి ఆధ్యక్షతన సాహస కృత్యాల క్రీడల్లో పాల్గొన్న 17 మంది క్రీడాకారులు పతకాలు, ప్రశంసాపత్రాలు సాధించారు.
2022లో ఉత్తరాఖండ్‌లోని పంగర్చుల పర్వతంలో నిర్వహించిన సాహస కృత్యాల్లో టీం లీడ్ చేసి తన సత్తా నిరూపించారు కన్నిబాయి.
చిన్నప్పటి నుంచి ఆటల్లో ఉన్న మక్కువ అంతర్జాతీయ స్థాయిలో ఆమెకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. వివిధ రకాల పతకాలు సాధించడంతో పాటు అడ్వెంచర్ క్లబ్ బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచింది. వాటర్ ర్యాప్లింగ్ పోటీల్లో తనదైన ముద్రవేసి ఆదివాసీ మహిళలందరికీ ఆదర్శంగా నిలుస్తోంది కెరమెరి మండలం భీమన్‌గోంది గ్రామానికి చెందిన కన్నిబాయి. నేడు వాటర్ ర్యాప్లింగ్ దినోత్సవం సందర్భంగా కథనం.. – కెరమెరి
కెరమెరి మండలంలోని భీమన్‌గోంది గ్రామానికి చెందిన మడావి భీంబాయి –జైతుల కూతురు కన్నిబాయి 1 నుంచి 10వ తరగతి వరకు ఆసిఫాబాద్‌లోని ఎస్టీ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుకుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ విద్యనభ్యసించింది. వాటర్ ర్యాప్లింగ్ పోటీల్లో పాల్గొంటూ ఎన్నో ఘనతలు సాధించింది. దీంతో ఆమెను అడ్వెంచర్ బ్రాండ్ అంబాసిడర్‌గా డబ్ల్యూఆర్‌డబ్ల్యూవోసీ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ రంగారావు నియమించారు.
కన్నిబాయి సాధించిన ఘనతలు..
జలపాతాలను రక్షిస్తూ..
వాటర్ ఫాల్ ర్యాప్లింగ్ వరల్డ్‌కప్ ఆర్గనైజింగ్ కమిటీ (డబ్ల్యూఆర్‌డబ్ల్యూవోసీ) ప్రపంచంలో గల జలపాతాలను రక్షిస్తూ సాహస కృత్యాలకు అనుకూలంగా వాటిని మార్చే చర్యలు చేపడుతోంది. జలపాతాలను సర్వే చేయడం, జలపాతాల ఆవశ్యకత, ప్రాధాన్యతలను విద్యార్థులకు, యువతకు వివరించడం, జలపాతాలను ధ్రువీకరించడం, ట్రయల్ రన్ నిర్వహించడం, బ్రాండింగ్ చేయడం, జలపాతాల్లో ర్యాప్లింగ్ పోటీలు నిర్వహించడం వంటి పనులు చేస్తుంది. ఇప్పటి వరకు 100 జలపాతాలు సర్వే చేయగా అందులో 60 వరకు జలపాతాలు వాటర్ ర్యాప్లింగ్‌కు అనుకూలంగా ఉన్నాయని డబ్ల్యూఆర్‌డబ్ల్యూవోసీ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ రంగారావు తెలిపారు.


