ఆటో బోల్తా.. ఒకరు మృతి | - | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా.. ఒకరు మృతి

May 11 2026 9:31 AM | Updated on May 11 2026 9:31 AM

కడెం: మండలంలోని ఉడుంపూ ర్‌ సమీపంలో జరిగి న రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఎస్సై సాయికిరణ్‌ తెలిపి న కథనం ప్రకారం.. లక్సెట్టిపేట్‌కు చెందిన హన్మండ్ల కొమురయ్య (68) కడెంలో తన కూతురు ఇంటికి వెళ్లి, శనివారం ఆటోలో కుటుంబ సభ్యులతో కలిసి సిరికొండ మండలం వాయిపేట్‌ మహంకాళీ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో ఉడుంపూర్‌ సమీపంలో గండి పోచమ్మ ఆలయం వద్ద ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కొమురయ్యను లక్సెట్టిపేట్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఆటోలో ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, కుమారులున్నారు. కుమారుడు మహేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

గుండెపోటుతో ఒకరు..

కడెం: మండలంలోని పెద్దూర్‌కు చెందిన తెలంగా ణ దివ్యాంగుల పునరావాస అభివృద్ధి ఆర్గనైజేష న్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట్ల క్రాంతికుమార్‌ యాదవ్‌ (42) ఆదివారం గుండెపోటుతో మృతిచెందారు. మధ్యాహ్నం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌లో ఖానాపూర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు.

బావిలో పడి ఒకరు..

దస్తురాబాద్‌: ప్రమాదవశాత్తు బావిలో పడి ఒక రు మృతి చెంది న సంఘటన మండలంలోని గోడిసీర్యాల గ్రా మంలో చోటు చేసుకుంది. మృతుడి భార్య అంజలి, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోడిసీర్యాల గ్రామానికి చెందిన పోడెటి మహేందర్‌ (31)కు కొద్ది రోజుల నుంచి మతి స్థిమితం సరిగా లేదు. ఈ నెల 9న ఇంటి నుంచి బయలు దేరి వెళ్లిన ఆయన రాత్రి అయినా ఇంటికి రాలేదు. ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదివారం ఓ వ్యవసాయ బావిలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఖానాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై సాయికుమార్‌ తెలిపారు.

పురుగుల మందు తాగి

ఒకరు ఆత్మహత్య

బోథ్‌: ఘన్‌పూర్‌ గ్రామంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బోథ్‌ ఎస్సై పురుషోత్తం తెలిపిన వివరాల ప్రకారం.. సిసింద్‌ అలియాస్‌ సుశీల్‌ (31) మద్యానికి బానిసై ఆదివారం డబ్బులు కావాలని భార్య సురేఖతో గొడవ పడ్డాడు. అనంతరం చేనుకు వెళ్లి పురుగుల మందు తాగాడు. మండల కేంద్రంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement