మీకు తెలుసా..?
లోకేశ్వరం: ప్రాచీన దేవాలయాలలో ఒకటిగా పేరొందింది బ్రహ్మేశ్వరాలయం. పవిత్ర గో దావరి నది ఒడ్డున వెలసిన ఈ ఆలయం మండలంలోని కన్కపూర్ గ్రామ సమీపంలో ఉంది. క్రీస్తు పూర్వం వేదవ్యాసుడు ఈ ఆలయానికి వచ్చి వెళ్లేవాడని పూర్వీకులు చెబుతుంటారు. దాదాపు 1900 ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని ని ర్మించారని, కాకతీయుల కాలంలో రాణి రు ద్రమ దేవి వివాహం ఇక్కడే జరిగినట్లు పెద్దలు పేర్కొంటున్నారు. ఆలయ సమీపంలో గో దావరి నది ఉత్తరవాహినిగా ప్రవహిస్తుండటంతో ఇక్కడ స్నానాలు ఆచరిస్తే సకల రోగాలు న యమవుతాయని ప్రతీతి. ఏడాదిలో కొన్ని రో జుల పాటు సూర్యకిరణాలు ఆలయంలోని శివలింగాన్ని తాకుతాయి. ఇక్కడ ఐదు వృక్షాలు ఒకే కాండం సమూహంగా పెరగడంతో ప్రత్యేక పూజలు జరుపుతుంటారు. ఇక్కడ శివలింగంతో పా టు నాగ దేవత, గణపతి, ఆంజనేయ, నవగ్రహ విగ్రహాలు ప్రతిష్టించారు. ఆలయ చరిత్ర ఒక శిలపై దేవనాగ లిపిలో చెక్కి ఉండడం గమనా ర్హం. ప్రతీ ఏడాది శివరాత్రి ఉత్సవాలు మూడు రోజుల పాటు ఇక్కడ ఘనంగా జరుగుతాయి.


