లోకేశ్వరం: ముధోల్ నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో హుండీలను పగులగొట్టి దొంగతనానికి పాల్పడిన ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి ఆదివారం లోకేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో భైంసా ఏఎస్సీ సాయికిరణ్ వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ భైంసా మండలంలోని చుచుంద్ గ్రామానికి చెందిన కొబ్బూల మారుతి, పిల్లోల్ల రాజు అనే ఇద్దరు యువకులు ఈనెల 8న తెల్లవారుజామున లోకేశ్వరం శివాలయంలో గడ్డపారతో హుండీని పగలగొట్టేందుకు యత్నించారు. ఒక్కసారిగా అలారం మోగడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకునే లోగా బైక్‌ను వదిలి పారిపోయారు. బైక్ నంబర్ ఆధారంగా ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించారు. తాగుడికి బానిసైన ఇద్దరు లోకేశ్వరం శివాలయం, భాగాపూర్ గ్రామంలోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో రెండుసార్లు, బాగాపూర్‌లో జగన్‌మోహన్‌రెడ్డి గెస్ట్ హౌస్‌లో, ముధోల్ మండలంలోని ఎడ్‌బిడ్ గ్రామంలోని మల్లన్న దేవాలయంలో, మాచ్‌కల్‌లోని పోచమ్మ ఆలయంలో, రాంటెక్ గ్రామంలోని మహాదేవ్ ఆలయంలో, భైంసా మండలంలోని ఈలేగాం మార్కండేయ ఆలయంలో చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి రూ.6వేల నగదు స్వాధీనం చేసుకొని ఇద్దరిని రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. ముథోల్ సీఐ రవీందర్, లోకేశ్వరం ఎస్సై అశోక్‌లు ఉన్నారు.


