మామడ : నిర్మల్‌లోని గాయిత్రీ టౌన్‌షిప్‌కు చెందిన విజయలక్ష్మి–గోపాల్ దంపతులు ఖానాపూర్‌లో వ్యవసాయం చేస్తూ కుమారులు సాయికృష్ణ, హరికృష్ణను ఉన్నత చదువులు చదివించారు. సాయికృష్ణ వైద్యుడిగా ఏరియా ఆసుపత్రిలో సేవలు అందిస్తున్నాడు, హరికృష్ణ టీఎస్‌పీఎస్సీలో ప్రతిభ చూపి మామడ మండల పరిషత్ అధికారిగా పనిచేస్తున్నాడు. తల్లి ప్రోత్సాహంతోనే ఈ విజయాలు సాధించామని కుమారులు పేర్కొన్నారు.
ఉద్యోగ బాధ్యతలు
స్వీకరించిన హరికృష్ణకు స్వీటు తినిపిస్తున్న
తల్లి విజయలక్ష్మి


