కుంటాల : కుంటాలకు చెందిన సరస్వతి కుమారుడు సతీశ్‌కుమార్ పోలియోతో బాధపడుతున్నాడు. నడవలేడు. లేచి నిలబడలేడు. ప్రస్తుతం అతని వయసు 35 ఏళ్లు. అయినా సతీశ్‌కుమార్‌కు పసి పిల్లాడిలా సేవలు చేస్తోంది. తండ్రి మరణం తర్వాత ఒంటరిగా చూసుకుంటోంది. ఇప్పటికీ స్నానం చేయించడం, భోజనం తినిపించడం వరకు అన్నీ తాను చేస్తూ ’సేవ అదృష్టం’ అని భావిస్తోంది. ఆమె అపార మాతృప్రేమ సమాజానికి స్ఫూర్తిదాయకం.
కుమారుడు సతీశ్‌కు తల
దువ్వుతున్న తల్లి సరస్వతి


