ముందునుంచీ మాది రాజకీయ కుటుంబమే. అందులోనూ మా ముగ్గురు కుటుంబసభ్యులు నిర్మల్ మున్సిపల్ చైర్మన్లుగా చేశారు. కానీ.. ఇప్పుడు నేను చైర్‌పర్సన్ అయ్యాను. పుర‘పాలన’కు సంబంధించిన పనులు చూసుకుంటూనే ఇంట్లో పిల్లలు శౌర్యచక్రవర్తి, ఆద్యల ఆలన కూడా చూసుకోవాలి. ఆడవాళ్లు ఏ పనిలో ఉన్నా.. ఏ స్థాయికి ఎదిగినా.. అమ్మ స్థానాన్నే ఎక్కువగా ఇష్టపడతారు. ప్రతీ తల్లి తనకంటే తన పిల్లల గురించే ఎక్కువగా ఆలోచిస్తుంది. నేను అంతే. అమ్మలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు.
– అప్పాల కావ్య గణేశ్‌చక్రవర్తి,
మున్సిపల్‌చైర్‌పర్సన్, నిర్మల్


