సమాజంలో, విధుల్లో ఏ స్థాయిలో ఉన్నా.. ఇంట్లో పిల్లలకు మాత్రం అమ్మగా ఉండటమే అన్నింటికంటే బాధ్యతాయుతమైనది. పోలీసుశాఖలో ఓవైపు డ్యూటీ చేస్తూనే మా ఇద్దరు బాబుల చదువు, కెరీర్‌లో గైడెన్స్ ఇస్తున్నాను. పెద్దబాబు ధీరజ్ గ్రూప్–1 సెలక్ట్ అయి, ప్రస్తుతం డీఎస్పీగా విధులు నిర్వరిస్తున్నాడు. చిన్నబాబు ప్రీతమ్ నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసర్చ్(నల్సార్)లో లా చదువుతున్నాడు. విధినిర్వహణలో ఎంత బిజీగా ఉన్నా అమ్మగా చేసే డ్యూటీ చాలా గొప్పది. అమ్మలందరికీ.. హ్యాపీ మదర్స్ డే.
–డా.జానకీషర్మిల, ఎస్పీ


