విద్యా వారోత్సవాలు విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

విద్యా వారోత్సవాలు విజయవంతం చేయాలి

May 10 2026 8:16 AM | Updated on May 10 2026 8:16 AM

● రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు

నిర్మల్‌చైన్‌గేట్‌: ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక‘ లో భాగంగా ఈ నెల 11 నుంచి 17 వరకు నిర్వహించే విద్యాశాఖ వారోత్సవాలు విజయవంతం చేయాల ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారా వు అధికారులను ఆదేశించారు. 99 రోజుల ప్రత్యేక ప్రణాళిక, విద్యా వారోత్సవాలు, వరి ధాన్యం కొనుగోళ్లు, జనగణన సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌, ఫార్మర్‌ రిజి స్ట్రీ, తదితర అంశాలపై, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాదు నుంచి, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో శనివారం వీ డియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా మాట్లాడుతూ విద్యా వారోత్సవాల్లో భాగంగా విద్యాసంస్థల్లో పనుల శంకుస్థాపనలు, పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థుల ఉత్తీర్ణత కోసం ప్రత్యేక విద్య శిబిరాల నిర్వహణ, వర్క్‌షాప్‌ల ఏర్పాటు, జయశంకర్‌ బడిబాట కార్యక్రమం, పోషకులతో సమావేశాలు, విద్యా వేడుకల కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకో వాలని సూచించారు. ఫార్మర్‌ రిజిస్ట్రీ ప్రక్రియ, జనగణన సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ వేగవంతం చేయాలన్నా రు. వరి ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని ఆదేశించారు. తగినన్ని గన్నీ సంచులు, లారీలు, హమాలీలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించా రు. వీసీలో అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌, ఆర్డీవో రత్నకళ్యాణి, డీఆర్డీవో విజయలక్ష్మి, డీఈవో భోజ న్న, డీఏవో అంజిప్రసాద్‌, పౌర సరఫరాల అధికా రి, మేనేజర్లు రాజేందర్‌, సుధాకర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement