న్యూస్‌రీల్
దుండగులను ఎదిరించకూడదు. ప్రమాదకర ప్లాన్లు వేయకూడదు.
కళ్లలోకి చూడకూడదు, రెచ్చగొట్టవద్దు.
రహస్య ప్రదేశాల్లో డిజిటల్ రికార్డింగ్, సీసీటీవీలు అమర్చుకోవాలి.
అత్యవసర పోలీసు నంబర్లు బోర్డులపై డిస్‌ప్లే చేయాలి.
అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గమనించండి.
మొబైల్ ఫోన్ వాడకంపై నియంత్రణ, స్ట్రాంగ్ రూమ్‌లు నిర్మించండి.
గత సంవత్సరం సెప్టెంబర్‌లో బాసర్ బేకరీలో అర్ధరాత్రి షట్టర్ పగలగొట్టి నగదు చోరీ చేశారు.
తానూర్ మండలంలో శ్రీలక్ష్మి వైన్స్ షాపు, బస్టాండ్ సమీప గోలి బిస్కెట్ షాపుల్లో రేకులు తొలగించి చోరీ చేశారు.
బైంసా బస్టాండ్ సమీపం నాలుగు వస్త్ర దుకాణాల్లో దొంగలు చోరీలకు పాల్పడ్డారు.
అక్టోబర్‌లో బైంసా–బాసర్ మార్గంలో మక్రాన్ టైల్స్ దుకాణం నుంచి రూ.2.40 లక్షలు అపహరించారు.
ఫిబ్రవరిలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో చోరీ జరిగింది.
మన బంగారం.. భద్రమేనా?
జిల్లాలో ఇటీవలి ఘటనలు
పాఠశాలల్లో వసతులు కల్పించాలి
నిర్మల్ రూరల్: వచ్చే విద్యా సంవత్సరానికి పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూక్య రాజేశ్‌నాయక్ కోరారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడా రు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే 100 శాతం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేయాలన్నారు. టై, బెల్టులు, స్కూల్ బ్యాగులతోపాటు నోటుబుక్కులు కూడా అందించాలని కోరారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పూ ర్తి చేసి వెంటనే బిల్లును చెల్లించాలని కోరారు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సాంకేతిక విద్య బోధించేందుకు ప్రతీ పాఠశాలకు రెండు కంప్యూటర్లు అందించి వాటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని కోరారు. పాఠశాలల అభివృద్ధిలో సర్పంచుల భాగస్వామ్యాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రతీ గ్రా మంలోని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరేలా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని కోరారు.
నిర్మల్‌టౌన్: నాలుగైదేళ్లుగా బంగారం ధరలు పెరుగుతూనే పోతున్నాయి. ప్రస్తుతం తులం బంగారం రూ.1.50 లక్షల పలుకుతోంది. భవిష్యత్ అంతా బంగారం, వెండిదే అని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దొంగలు రూట్ మార్చారు. గతంలో ఇళ్లలో చోరీలు చేసేవారు ఇప్పుడు జువెల్లరీ షాపులను టార్గెట్ చేస్తున్నారు. భయం లేకుండా బరితెగిస్తూ, పగటిపూట జ్యువెలరీ షాపులు, మహిళల మెడల్లోని ఆభరణాలు లక్ష్యం చేసుకుంటున్నారు. ఇటీవల కరీంనగర్‌లో పట్టపగలే జువెల్లరీ షాపు భారీ చోరీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన సృష్టించింది.
దొంగతనాలు విరివిగా
పగలు రెక్కీ నిర్వహస్తున్న దొంగలు రాత్రి కన్నాలు వేస్తున్నారు. తాజాగా కరీంనగర్‌లో పగలే కస్టమర్లలా వచ్చిన దొంగలు షాపులోని ఉద్యోగులపై కాల్పులు జరిపారు. నగలు బ్యాగుల్లో నింపుకుని పారిపోయారు. సీసీ కెమెరాలకు కూడా చిక్కకుండా జాత్త్రలు పడుతున్నారు. జువెల్లరీ షాపుల నుంచి చిన్న దుకాణాలను కూడా దొంగలు టార్గెట్ చేస్తున్నారు.
వ్యాపారుల్లో ఆందోళన
కరీంనగర్ ఘటనలో జ్యువెలరీ, ఇతర దుకాణ యజమానుల్లో భయం పెరిగింది. రాత్రి వేళల్లో నగదు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లే ఘటనలు జరుగుతున్నాయి. కరీంనగర్ నగల షాపులో చోరీ చేసిన దొంగలు మహారాష్ట్ర పారిపోయినట్లు తెలుస్తోంది. జిల్లా సరిహద్దులో మహారాష్ట్ర ఉండడం, దొంగల ముఠా మహారాష్ట్రకు చెందినదే అని భావిస్తున్నారు. పోలీసులు మహారాష్ట్ర సరిహద్దు, బాసర్ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో నిఘా పెంచాలి. అనుమానాస్పద వ్యక్తులను విచారించాలి. దుకాణాల్లో సీసీటీవీలు, అలారం సిస్టమ్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. రాత్రి పహారా, అదనపు గార్డులు నియమించాలి.
ప్రజల తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వ్యాపారులు కస్టమర్లపై నిరంతర నిఘా ఉంచాలి.
సీసీ కెమెరాలు అమర్చుకోవాలి
బంగారు షాపులతోపాటు ఇతర షాపుల యజమానులు సీసీ కెమెరాలు అమర్చుకోవాలి. షాపుల్లో సైరన్ ఏర్పాటు చేసుకోవాలి. దీంతో దుండగులు లోనికి చొరబడినప్పుడు అలారం మోగడంతో చుట్టుపక్కల వారు, పోలీసులు అక్కడికి చేరుకుంటారు. అంతేకాకుండా ఏటీఎంలో, బ్యాంకులు, బంగారు దుకాణాల యజమానులు సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలి. సెంట్రల్ లాకింగ్ అమర్చుకోవాలి. అనుమానాస్పద వ్యక్తులు కనబడితే పోలీసులకు సమాచారం అందించాలి. – జానకీషర్మిల, ఎస్పీ


