కడెం: మండలంలోని పాండ్వపూర్ గ్రామంలోని అటవీశాఖ చెక్‌పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన ఫాస్టాగ్‌ను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ శుక్రవారం ప్రారంభించారు. పాండ్వపూర్, ఉట్నూర్, ఇంధన్‌పల్లి, తపాల్‌పూర్ చెక్‌పోస్ట్‌ల్లో స్థానికులకు ఫాస్టాగ్ చార్జ్ మినహయింపు ఉంటుందన్నారు. అంతకుముందు మండల కేంద్రంలోని రైతువేదికలో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కడెం ప్రాజెక్ట్ ఎడమ కాలువ వద్ద జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. ఆయన వెంట డీఎఫ్‌వో సుశాంత్‌సుఖ్‌దేవ్, ఎఫ్‌డీవో శివకుమార్, తహసీల్దార్ ఖాజా మొయినుద్దీన్, ఎంపీడీవో సునీత, ఎఫ్‌ఆర్వో గీతా రాణి, ఎంపీవో శ్రీనివాస్, డీసీసీ ప్రధాన కార్యదర్శి పొద్దుటూరి సతీశ్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లేశ్, సర్పంచులు ఫోరం మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, సర్పంచ్ విజయ, దీకొండ విజయ్‌కుమార్, భీమేశ్, ఆశ్విత, తేజస్విని, రమేశ్, డీఆర్వోలు సిద్దార్ద, ప్రకాశ్, నాయకులు రాజశేఖర్, ప్రతాప్, మల్లయ్య, నారయణ తదితరులు ఉన్నారు.
సమన్వయంతో పనిచేయాలి
ఖానాపూర్: కలెక్టర్ భవేశ్ మిశ్రాను డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్క అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలుపై కలెక్టర్‌తో చర్చించారు.


