కుంటాల: తూకం వేసిన మక్కల తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ.. లోకేశ్వరం మండలం రా జురా గ్రామ రైతులు కుంటాల మండలం అర్లి(కె) వద్ద 61వ జాతీయ రహదారిపై శుక్రవారం రాస్తారోకో చేశారు. లోకేశ్వరం మండలం రాజు రా గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో 20 రోజుల క్రితం మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సంబంధిత శాఖ అధికారులు 10 వేల బస్తాల మక్కలు కొనుగోలు చేశారు. ఇప్పటి వర కు వాటిని తరలించక పోవడంతో ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న లోకేశ్వరం, నర్సాపూర్(జి) తహసీల్దార్లు సూర్యారావు, శ్రీకాంత్, ఏవో గిరిరాజ్ ఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు రోజుల్లో పది లారీలు పంపించి మక్కలు తరలిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించా రు. రెండున్నర గంటలకుపైగా రాస్తారోకో చేయడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. భైంసా రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సైలు, సి.అశోక్, జి.అశోక్ ఆధ్వర్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా భైంసా–నిర్మల్ వెళ్లే వారిని కుంటాల, అంబకంటి, నర్సాపూర్ (జి), గ్రామా ల మీదుగా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
కాళ్లు మొక్కుతం సారూ..
నిబంధనలు విధించకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రాజురా సర్పంచ్ సుందరగిరి శ్యామల భర్త మాజీ సర్పంచ్ ముత్తాగౌడ్ తహసీల్దార్ సూర్యారావు కాళ్లు మొక్కుతూ రైతుల తరఫున విన్నవించారు.


