కుంటాల: డీబీటీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ )విధానంలో మార్పు చేయకపోతే డ్రాప్స్ పెరిగే ప్రమాదం ఉందని కాకతీయ యూనివర్సిటీ ప్రైవేట్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ ఆర్గనైజర్ రాష్ట్ర సెక్రెటరీ బోయ సాయిలు పేర్కొన్నారు. మండలంలోని కల్లూరు వాసవీ కళాశాలలో గురువారం మాట్లాడారు. విద్యార్థులకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశాన్ని స్వాగతిస్తున్నప్పటికీ, ఈ విధానం ద్వారా భవిష్యత్తులో విద్యాసంస్థలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వానికి సూచించా రు. డీబీటీ విధానంలో మార్పు చేసి విద్యా వ్య వస్థ స్థిరత్వాన్ని కాపాడాలని, పెండింగ్ బకా యిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు గట్టుపల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


