జిల్లా కవికి అరుదైన గౌరవం | - | Sakshi
Sakshi News home page

జిల్లా కవికి అరుదైన గౌరవం

May 8 2026 1:07 PM | Updated on May 8 2026 1:07 PM

నిర్మల్‌ఖిల్లా: భాష సాంస్కృతిక శాఖ తెలంగా ణ ప్రభుత్వం నిర్వహిస్తున్న 99 రోజుల సాంస్కతిక కళారూపాల ప్రదర్శనలో భాగంగా రవీంద్ర భారతిలో కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు. కవిత గానంలో మొదటి కవిగా నిర్మల్‌కు చెందిన సీనియర్‌ కవి, తాత్విక రచయిత మునిమడుగుల రాజారావుకు అవకాశం దక్కింది. తన కవితాగానంతో ఆహుతులను ఆకట్టుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సాంస్కృతికశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఏ.వాణీప్రసాద్‌, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి చేతుల మీదుగా ప్రత్యేక సత్కారం పొందారు.

Advertisement
 
Advertisement
Advertisement