నిర్మల్‌చైన్‌గేట్: ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి పురస్కరించుకొని తెలంగాణ నర్సింగ్ ఆఫీస ర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం జనరల్ ఆస్పత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కొందరు నర్సింగ్ ఆఫీసర్లు రక్తదానం చేశారు. కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ గోపాల్‌సింగ్, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్–1 వనజ, గ్రేడ్–2 విజయలక్ష్మి, పారిజాతం, ధనలక్ష్మి, ఆఫీస్ సూపరింటెండెంట్ నవీన్‌కుమార్, హెడ్‌నర్స్ అపర్ణ యేసుమణి, జయలక్ష్మి, పుష్పలత, అసోసియేషన్ అధ్యక్షుడు బాణాల రమేష్, నర్సింగ్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.


