నిర్మల్‌చైన్‌గేట్: వరదల సమయంలో అన్ని శాఖల సమన్వయం అవసరమని కలెక్టర్ భవేశ్‌మిశ్రా అన్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వరదల నివారణ, విపత్తు నిర్వహణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లు, పోలీస్ అధికారులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయి సమన్వయ సమావేశం గురువారం నిర్వహించింది. ఈ సమావేశంలో కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ జానకీ షర్మిల పాల్గొన్నారు. జిల్లాలో వర్షాకాలానికి ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలు, వరదల సమయంలో తక్షణ స్పందన, ప్రజల రక్షణ, సహాయక చర్యలు, అత్యవసర సేవల సమన్వయంపై సమీక్షించారు. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న గ్రామాలు, చెరువులు, వాగులు, కాలువలు, రహదారుల పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వర్షాకాల సన్నద్ధతలో భాగంగా నిర్మల్ జిల్లాలో జిల్లాస్థాయి ఫ్లడ్ మాక్ ఎక్సర్‌సైజ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనిద్వారా వరదల సమయంలో తీసుకోవాల్సిన అత్యవసర చర్యలను ప్రాయోగికంగా అమలు చేసి శాఖల మధ్య సమన్వయాన్ని పరీక్షించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మున్సిపల్ పరిపాలన, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా శాఖలతోపాటు ఇతర అత్యవసర సేవల విభాగాలు పాల్గొంటాయన్నారు. ప్రజ ల తరలింపు ప్రక్రియ, సహాయక శిబిరాల ఏర్పా టు, రక్షణ చర్యలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందన విధానాలను సమగ్రంగా పరిశీలించనున్నట్లు వెల్లడించారు. విపత్తుల స మయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, అవసరమై న యంత్రాంగం, సిబ్బంది, పరికరాలను సిద్ధంగా ఉంచాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ప్రజలకు ముందస్తు హెచ్చరికలు అందించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్‌కుమార్, సబ్ కలెక్టర్ సంకేత్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
వేగంగా డిజిటల్ జనగణన
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో డిజిటల్ జనగణన–2027 ప్రక్రియ పకడ్బందీగా సాగుతోందని కలెక్టర్ భవేశ్ మిశ్రా వెల్లడించారు. హైదరా బాద్ నుంచి డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతి హోళ్లికేరి జనగణన – 2027 విధివిధానాలు, సంబంధిత అంశాలపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో గురువారం వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా నివేదికను వివరిస్తూ, జిల్లాలో ఇప్పటివరకు 93.844 శాతం స్వ యం గణన పూర్తయిందని, 12,897 మంది నమోదువిజయవంతంగా ముగిశాయని వివ రించారు. జనగణన విధుల్లో పాల్గొనే సిబ్బంది శిక్షణపై ప్రత్యేక దృష్టి సారించి, జిల్లావ్యాప్తంగా ఏర్పా టు చేసిన 44 శిక్షణ బ్యాచ్‌లు వంద శాతం లక్ష్యాన్ని చేరుకున్నాయన్నారు. క్షేత్రస్థాయి నిర్వహణకు కీలకమైన 1551 హౌస్ లిస్టింగ్ బ్లాక్ డీమార్కేషన్ ప్రక్రియను ఆన్‌లైన్ పోర్టల్‌లో వంద శాతం పూర్తిచేసినట్లు తెలిపారు. ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు అవసరమై న కిట్ల పంపిణీ వేగంగా జరుగుతోందన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, కిశోర్‌కుమార్, సీపీవో జీవరత్నం, అధికారులు పాల్గొన్నారు.


