బోనమెత్తిన రాచాపూర్‌ | - | Sakshi
Sakshi News home page

బోనమెత్తిన రాచాపూర్‌

May 7 2026 9:56 AM | Updated on May 7 2026 9:56 AM

లక్ష్మణచాంద: మండలంలోని రాచాపూర్‌ బోనమెత్తింది. బుధవారం గ్రామంలో పెద్దమ్మతల్లి ఆలయ ఐదోవార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటికో బోనం చొప్పున సిద్ధం చేశారు. అనంతరం మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ముందుగా మహాలక్ష్మి, అనంతరం పెద్దమ్మతల్లి అమ్మవార్లకు బోనాలు సమర్పించి పూజలు చేశారు. పిల్లాపాపలతో చల్లగా చూడాలని మొక్కుకున్నారు. కరీంనగర్‌ జిల్లా రామడుగుకు చెందిన తొమ్మిదిమంది బైండ్ల పూజారులు ఊరేగింపులో ప్రత్యేక ఆకర్శణగా నిలిచారు. సర్పంచ్‌ మహేశ్‌, గ్రామస్తులు, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement