నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

May 7 2026 9:56 AM | Updated on May 7 2026 9:56 AM

● ఫంక్షన్లలో పేపర్‌ ప్లేట్లకు ఫుల్‌స్టాప్‌ ● సింగిల్‌యూస్‌ ప్లాస్టిక్‌పైనా నిషేధం ● ఊరూరా కొనసాగుతున్న ఉద్యమం గురువారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2026

న్యూస్‌రీల్‌

ప్లాస్టిక్‌ అంతం..

స్టీల్‌ బ్యాంక్‌ల ఏర్పాటుకు శ్రీకారం

గోల్‌ కొట్టేద్దాం!

వేసవి శిక్షణ శిబిరాలతో జిల్లాలోని క్రీడామైదానాలన్నీ కళకళలాడుతున్నాయి. చిన్నారులకు వివిధ క్రీడాంశాల్లో కోచ్‌లు శిక్షణ ఇస్తుండగా అధికసంఖ్యలో హాజరవుతున్నారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.శ్రీవాణిని కోర్టు కార్యాలయంలో బుధవారం కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా మర్యాదపూర్వకంగా కలిశారు. పూలమొక్క అందించారు. అనంతరం ఇరువురు పలు అంశాలపై చర్చించారు.

నిర్మల్‌: సింగిల్‌ యూస్‌ ప్లాస్టిక్‌ నిషేధానికి పల్లెలు క దులుతున్నాయి. ఊరూరా స్టీల్‌బ్యాంక్‌లు ఏర్పాటు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. సాధారణంగా ఊళ్లో ఎవరింట్లో ఫంక్షన్‌ చేసినా కనీసం 6–8కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థం వస్తోంది. పేపర్‌ప్లేట్లు, వాటర్‌గ్లాసులు, చాయ్‌కప్పులు, స్వీట్‌, ఐస్‌క్రీమ్‌ కప్పులు, వా టిల్లోకి చెంచాలు, వాటర్‌ బాటిళ్లు ఇలా.. అన్నీ సింగిల్‌యూస్‌ ప్లాస్టికే. ఒక్క పెళ్లి చేస్తేనే ఇలా కిలోల కొద్దీ ప్లాస్టిక్‌ జమవుతోందంటే.. జిల్లా మొత్తంలో ఎన్ని టన్నుల్లో ఈ ప్రమాదకరమైన వ్యర్థం పెరుగుతుందో తెలుసుకోవచ్చు. ఈ ప్లాస్టిక్‌తో ప్రయోజ నం తాత్కాలికమే కానీ.. నష్టం మాత్రం దీర్ఘకాలికంగా ఉంటుందన్నది వాస్తవం. దీన్ని అర్థం చేసుకున్న చాలా గ్రామాలు ఏంచేయాలో ఆచరణలో చూపెడుతున్నాయి. ప్లాస్టిక్‌ రహిత పల్లె దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ‘స్టీల్‌బ్యాంకు’ల ఏర్పా టు జిల్లాలో ఊరూరా ఉద్యమంలా సాగుతోంది.

పెరుగుతున్న క్యాన్సర్‌ బాధితుల సంఖ్య

ఒకప్పుడు పెళ్లిళ్లు, శుభకార్యాలు అంటే టెంట్‌హౌస్‌లు, సంఘాల్లో నుంచి స్టీల్‌ప్లేట్లు, గ్లాసులు తీసుకొచ్చేవారు. కానీ, ఇప్పుడంతా రెడీమేడ్‌, సింగిల్‌ యూస్‌. అలా తినడం, తాగడం.. ఇలా పడేయడం. అంతే.. కడగడం, పెట్టడం అంటూ ప్రత్యేకంగా ఏ పనీ ఉండదు. ఏళ్లుగా సాగుతున్న ఈ తంతు కొంతకాలంగా తన ప్రభావాన్ని చూపిస్తోంది. కొత్తరకం క్యాన్సర్లు, రోగాలను తీసుకొస్తోంది. మాధ్యమాల ద్వారా చాలామంది వైద్యులు కొంతకాలంగా ఈ తరహా సింగిల్‌యూస్‌ ప్లాస్టిక్‌ను వాడటంతో జరిగే అనర్థాలను వివరిస్తున్నారు. చాలా ఊళ్లల్లో కళ్లెదుటే క్యాన్సర్‌ తదితర రోగాలబారిన పడుతున్న బాధితుల సంఖ్య పెరుగుతున్న తీరూ కదిలిస్తోంది.

స్టీల్‌బ్యాంక్‌లతో పెనుమార్పు

పర్యావరణానికి, మన ఆరోగ్యానికీ పెనుముప్పుగా మారుతున్న సింగిల్‌యూస్‌ ప్లాస్టిక్‌ను అరికట్టాలన్న ఆలోచన ఈమధ్య ఆచరణరూపంలోకి వస్తుండటం శుభసూచకం. ఏళ్లుగా అధికారులు చెబుతున్నా.. వి న్నవాళ్లు చాలా తక్కువ. కానీ.. ‘స్మార్ట్‌’జమానాలో అన్నీ కళ్లెదుటే కనిపిస్తుండటంతో ఇక మారాల్సిందేనంటున్నారు. ఈ మార్పులో పల్లెలు ముందుండటం గొప్పవిషయం. పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా గ్రామగ్రామా న ‘స్టీల్‌ బ్యాంకులు’ ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్లేట్లు, గ్లాసులు మొదలు ప్రతీదీ స్టీల్‌ వస్తువులను అందుబాటులో ఉంచుతున్నారు. వివాహాలు, శుభకార్యాలు, పండుగల వేళ ప్లాస్టిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఇవి ఉపయోగపడుతున్నాయి.

ప్రయోజనాలెన్నో..

స్టీల్‌బ్యాంకులతో గ్రామాల్లో మార్పు మొదలైంది. వాడి పారేసే ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగం గణనీయంగా తగ్గుతోంది. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతోంది. ప్లేట్లు, గ్లాస్లుల కొనుగోలు ఖర్చు తగ్గుతోంది. స్టీల్‌బ్యాంక్‌ల నిర్వహణకు కమిటీ వేసి, నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఊరూరా ఉద్యమంలా సాగుతున్న ‘స్టీల్‌బ్యాంకు’ల ఏర్పాటుతో ప్లాస్టిక్‌ రహిత జిల్లా కావాలని అధికారులు ఆశిస్తున్నారు.

కడెం మండలం లింగాపూర్‌లో స్టీల్‌బ్యాంక్‌ను ప్రారంభిస్తున్న గ్రామస్తులు

ఏంటీ.. స్టీల్‌బ్యాంక్‌..?

స్టీల్‌బ్యాంక్‌ అనేది గ్రామపంచాయతీ లేదా స్థానిక వీడీసీ, యువజన, కుల, కాలనీ సంఘాలలో నిర్వహించే కేంద్రం. ఇక్కడ స్టీల్‌ప్లేట్లు, గ్లాసులు, బౌల్స్‌, చెంచాలు ఇలా ఫంక్షన్లు, అన్నదానాలకు సంబంధించిన పూర్తి వంటసామగ్రిని నిల్వ ఉంచుతారు. ఊరి మీద నిర్వహించే అన్నదానాలు, సప్తాహాలు, పండుగలప్పుడు వీటినే ఉపయోగిస్తారు. వ్యక్తిగతంగా ఇళ్లల్లో ఏవైనా కార్యక్రమాలుంటే స్టీల్‌బ్యాంక్‌ నుంచి ఇస్తారు. కార్యక్రమం పూర్తయ్యాక వాటిని తిరిగి అందించాల్సి ఉంటుంది. చాలా గ్రామాల్లో వీటిని ఉచితంగానే ఇస్తున్నారు. పలువురు దాతలు స్టీల్‌బ్యాంకులకు ఈ వస్తువులను విరాళంగా అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement