నర్సాపూర్ (జి): పంటల కొనుగోళ్లలో జాప్యం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా అన్నదాతలు ఆందోళనకు దిగారు. నర్సాపూర్ (జి), దిలావర్‌పూర్ మండలాల్లోని రాంపూర్, టెంబుర్ని, గుండంపల్లి గ్రామాల రైతులు మొక్కజొన్న, జొన్న పంటలు కొ నుగోలు చేయాలని బుధవారం గుండంపల్లి ఎక్స్ రోడ్డు వద్ద 61వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచులు, లారీ ల కొరత, అధికారుల నిర్లక్ష్యంతో కొద్దిరోజులుగా కొనుగోళ్లు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈదురుగాలులు, అకాల వర్షాలతో తమ పంట ఏ మవుతుందోనని ఆందోళనకు గురవుతున్నట్లు చె ప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. సుమారు 5గంటల పాటు రోడ్డుపై బైఠాయించడంతో ఇరువైపులా వాహనాలు కిలోమీటర్ల మేర ని లిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కలెక్టర్ వచ్చేదాకా ఆందోళన విరమింపబోమని రైతులు భీష్మించారు. పోలీస్, రెవె న్యూ, వ్యవసాయశాఖల అధికారులు వచ్చి వారిని సముదాయించినా ససేమిరా అన్నారు. ఆర్డీవో రత్నకల్యాణి వచ్చి రైతులతో మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. చివరకు నర్సాపూర్ (జి) తహసీల్దార్ శ్రీకాంత్ కలెక్టర్ భవేశ్ మిశ్రాకు ఫోన్ చేసి రైతు రమణారెడ్డితో మాట్లాడించారు. రెండు, మూడు రోజుల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. ఆర్డీవో రత్నకల్యాణి, డీఏవో అంజిప్రసాద్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, సోన్ సీఐ గోవర్ధన్‌రెడ్డి, నర్సాపూర్ (జి), దిలావర్‌పూర్ ఎస్సైలు గణేశ్, రవీందర్, నర్సాపూర్ (జి), దిలావర్‌పూర్ తహసీల్దార్లు శ్రీకాంత్, ఎజాజ్ అహ్మద్, ఏవో రాంచందర్‌నాయక్, పోలీస్ సిబ్బంది తదితరులున్నారు.
అంబులెన్స్‌కు దారి ఇచ్చిన రైతులు
తమ పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలని గుండంపల్లి ఎక్స్ రోడ్డు వద్ద రాస్తారోకో చేస్తున్న అన్నదాతలు అంబులెన్స్‌కు దారి ఇచ్చి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. గర్భిణులు, చంటి పిల్లలతో వెళ్తున్న వాహనదారులకూ దారి ఇచ్చారు.


