మొక్కజొన్న కొనుగోళ్లలో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్న కొనుగోళ్లలో వేగం పెంచాలి

May 7 2026 9:56 AM | Updated on May 7 2026 9:56 AM

● కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా ● కొనుగోలు కేంద్రాల సందర్శన

గోదాముల నిల్వ సామర్థ్యం పరిశీలన

సారంగపూర్‌: మొక్కజొన్న కొనుగోళ్లలో వేగం పెంచాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా సూచించారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో నిర్వహిస్తున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. అంతకుముందే వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయంలోని గోదా ములను తనిఖీ చేశారు. యాసంగి ధాన్యం నిల్వ ఉంచేందుకు ఎంత మేర గోదాముల అవసరముందో సివిల్‌ సప్లయ్‌ అధికారులతో మాట్లాడారు. అ నంతరం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీ లించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమకు గన్నీబ్యాగుల కొరతతో పాటు లారీల సమస్య ఉందని కలెక్టర్‌కు వివరించారు. వెంటనే గన్నీ బ్యాగులు తెప్పించాలని, లారీ ల కొరత లేకుండా చూడాలని కలెక్టర్‌ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం పక్కనే ఉన్న జొన్నల కొ నుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. కొనుగో లు కేంద్రం ప్రారంభమైనా ఇంతవరకూ గన్నీబ్యాగులు ఇవ్వలేదని కలెక్టర్‌కు రైతులు తెలిపారు. తక్షణమే స్పందించిన కలెక్టర్‌ వెంటనే గన్నీ బ్యాగులు తెప్పించి రైతుల ఇబ్బందులు తీర్చాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌, తహసీల్దార్‌ విజయ్‌కాంత్‌రావు, ఎంపీడీవో లక్ష్మీకాంత్‌రావు, ఎంపీవో అజీజ్‌ఖాన్‌, ఏఎంసీ కార్యదర్శి ధూమ్డానాయక్‌, కోఆపరేటివ్‌ సొసైటీల ఇన్‌చార్జి భూమన్న, సీఈవో మల్లేశ్‌ తదితరులున్నారు.

ధాన్యపు సంచులను భద్రంగా నిల్వ చేయాలి

నిర్మల్‌చైన్‌గేట్‌: ధాన్యపు సంచులను భద్రంగా నిల్వ చేయాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అధికారులను ఆదేశించారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యా ర్డు గోదాములో ధాన్యం డంపింగ్‌ తీరును పరిశీలించారు. ఇప్పటివరకు నిల్వ చేసిన ధాన్యపు సంచుల వివరాలు, అన్‌లోడింగ్‌కు వరుసలో ఉన్న లారీల వి వరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. లారీల్లో వచ్చిన దాన్యపు సంచుల ను ఎప్పటికప్పుడు భద్రంగా నిల్వ చేయాలని సూ చించారు. ఎక్కువమంది హమాలీలను నియమించుకుని వెంటవెంటనే ధాన్యపు సంచుల డంపింగ్‌ ప్రక్రియ చేపట్టాలని తెలిపారు. అనంతరం సమీ పంలోని వరి, మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు లే కుండా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని సూ చించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ (రెవె న్యూ) కిశోర్‌కుమార్‌, పౌరసరఫరాల అధికారి, మే నేజర్‌ రాజేందర్‌, సుధాకర్‌, తహసీల్దార్‌ రాజు, ఏఎంసీ చైర్మన్‌ భీమ్‌రెడ్డి, అధికారులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement