ఖానాపూర్: గ్రామాలాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. మండలంలోని సత్తెనపల్లి గ్రామంలో రూ.12లక్షలతో చేపట్టిన అంగన్‌వాడీ భవనం, రూ.7.50 లక్షలతో చేపట్టిన పాఠశాల ప్ర హరీ, రూ.7లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణాల కు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లు పనులు నాణ్యతతో త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి ప్రా ధాన్యత ఇస్తూ అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తోందని చెప్పారు. అంతకుముందు గ్రామస్తులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. కార్యక్ర మంలో సర్పంచ్ సీర్ల విజయానంద్, నాయకులు నేతుల లక్ష్మణ్, గుమ్ముల రమేశ్, గోపీనాయక్, గంగారెడ్డి, పోశెట్టి, అధికారులు పాల్గొన్నారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: కాంగ్రెస్ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని స్థానిక పెన్షనర్ సంఘ భవనంలో కాంగ్రెస్ బూత్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి బూత్ లెవల్ ఏజెంట్లు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. టీపీసీసీ కార్యదర్శి ఏంబడి రాజేశ్వర్, నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీహరిరావు, నాయకులు సాధ సుదర్శన్, అప్పాల గణేశ్ పాల్గొన్నారు.
లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
దస్తురాబాద్: మండల కేంద్రంలోని తహసీల్దార్ కా ర్యాలయంలో ఎమ్మెల్యే బొజ్జు 60 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం పీఏసీఎస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన పీఏసీఎస్ చైర్మన్ రామడుగు శైలజ, డైరెక్టర్లను సన్మానించారు. కార్యక్రమంలో తహసీల్దార్ యాదవరావ్, ఆర్‌ఐ సంతోష్, మాజీ ఎంపీపీ సింగరి కిషన్, సర్పంచులు గోపాల్, నరేశ్‌రెడ్డి, నరేశ్, గంగన్న, సురేందర్ తదితరులున్నారు.


