భైంసాటౌన్: తీవ్ర రక్తస్రావంతో బాధపడుతూ అపస్మారక స్థితికి చేరుకున్న రెండు నెలల గర్భిణికి తక్షణ వైద్యసేవలు అందించి ఆమె ప్రాణం నిలిపిన ఘ టన భైంసాలోని ప్రభుత్వ ఏరియాస్పపత్రిలో జరి గింది. వివరాలు.. ముధోల్ మండలం ఎడ్‌బిడ్ గ్రా మానికి చెందిన లలిత రెండు నెలల గర్భిణి. ఈ క్ర మంలో బుధవారం తీవ్ర రక్తస్రావంతోపాటు బీపీ పడిపోయి అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో కు టుంబీకులు వెంటనే భైంసాలోని ప్రభుత్వ ఏరియాస్పత్రికి తీసుకురాగా, సూపరింటెండెంట్ కాశీనాథ్ నేతృత్వంలోని వైద్య బృందం వెంటనే స్పందించా రు. ముందుగా ఆమెకు అవసరమైన వైద్య చికిత్స అందజేసి, ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండటంతో ర క్తం అవసరమైంది. అప్పటికప్పుడు రక్తదాతలను సంప్రదించి ఆమెకు రెండు యూనిట్ల రక్తం ఎక్కించారు. కొద్ది సేపటికి ఆమె స్పృహలోకి వచ్చింది. ఆ మె పూర్తిగా కోలుకున్న తర్వాత 108 అంబులెన్స్‌లో తిరిగి ఇంటికి పంపించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న లలితకు సత్వర వైద్యం అందించి, ప్రాణాలు కాపాడడంతో ఆమె కుటుంబీకులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. గర్భిణికి వైద్యం అందించిన వైద్యులు రోజా, పవన్, సరోజ, కై లాస్, సుమను డాక్టర్ కాశీనాథ్ ప్రత్యేకంగా అభినందించారు.


