భైంసాటౌన్: పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రబీ ధాన్యం సేకరణ ప్రారంభమైంది. ఈ మేర కు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ప్రభుత్వ గోదా ములకు తరలిస్తున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని మిర్చియార్డులోగల 2,500 మెట్రి క్ టన్నుల సామర్థ్యమున్న గోదాముకు ధాన్యం సంచులను లారీల్లో తరలించారు. హమాలీల సహాయంతో ధాన్యం సంచులు అన్‌లోడ్ చేసి గోదాములో నిల్వ చేస్తున్నారు. ఈ మేరకు బుఽ దవారం సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్ గోదాముకు చేరుకుని తనిఖీ చేశారు. ధాన్యం నిల్వ తదితర వివరాలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్ శశిభూషణ్ తదితరులున్నారు.


