లక్ష్మణచాంద: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని బాలల సంరక్షణ అధికారి వోస శ్రీనివాస్ అన్నారు. మండల జరగాల్సిన ఓ బాల్య వివాహాన్ని మంగళవారం అధికారులు అడ్డుకున్నారు. 15 ఏళ్ల బాలికకు నిశ్చితార్థం చేశారని సమాచారం అందుకు న్న చైల్డ్ వెల్ఫేర్ అధికారులు బాలిక ఇంటికి చేరుకు ని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా బాలల ఆయన మాట్లాడుతూ బాల్య వివా హ నిరోధక చట్టం–2006’ ప్రకారం18 ఏళ్లలోపు బాలికలకు, 21 ఏళ్ల లోపు బాలురకి వివాహం చేయడం నేరమన్నారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను వివరించారు. పిల్లల భవిష్యత్తు కోసం వారి విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే 1098కు సమాచారం ఇ వ్వాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై శ్రావణి, డి ప్యూటీ తహసీల్దార్ బాబుసింగ్, సర్పంచ్ వోస కవి త, సూపర్‌వైజర్ ప్రసున్నకుమారి, చైల్డ్ హెల్ప్‌లైన్ జిల్లా సమన్వయకర్త నల్ల గంగాధర్, కౌన్సిలర్ సు ప్రియ, కేస్ వర్కర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.


