లోకేశ్వరం: మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయానికి మక్కల గన్నీ బ్యాగులు మంగళవారం వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న రైతులు ఒక్కసారిగా కార్యాలయానికి చేరుకున్నారు. బ్యాగులు తీసుకునే విషయంలో తోపులాట జరిగింది. ఈ సందర్భంగా వాగ్వాదం జరిగింది. సోమవారం 15 వేల బ్యాగులు రాగా, మంగళవారం 26 వేల బ్యాగుఉల వచ్చాయి. కొందరు రైతులు బ్యాగులను వాహనాల్లో తీసుకెళ్లారు. దీంతో అందరి రైతుల్లో నిరాశ నెలకొంది. ఈ విషయమై పీఏసీఎస్ సీఈవో భూషణ్‌ను వివరణ కోరగా రైతులు ఒక్కసారిగా వచ్చి తమ సిబ్బందిని తోసేసి గన్నీ బ్యాగులు లాక్కెళ్లారని తెలిపారు.


