మొక్కజొన్న కొనుగోళ్లకు బ్రేక్‌ | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్న కొనుగోళ్లకు బ్రేక్‌

May 6 2026 7:43 AM | Updated on May 6 2026 7:43 AM

● గన్నీ సంచులు లేక.. లారీలు రాక తూకం నిలిపివేత ● పంట అమ్ముకునేందుకు ఇబ్బంది పడుతున్న రైతులు

తానూరు: మండల కేంద్రం తానూరు, బెల్‌తరోడా గ్రామాల్లో మొక్క జొన్న కొనుగోళ్లు తాత్కాలికంగా నిలివేసినట్లు అధికారులు ప్రకటించారు. ఇటీవల కొనుగోలు చేసిన మొక్కజొన్న గోదాంలలో భారీమత్తంలో నిల్వలు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తానూరులో ఇప్పటివరకు 14 వేల క్వింటాళ్లు, బెల్‌తరోడాలో 6 వేల క్విటాళ్లు కొనుగోలు చేశారు. తానూరులో 28 వేల బ్యాగులకు 17 వేల బ్యాగులు తీసుకువెళ్లగా 11 వేల బ్యాగులు కేంద్రంలో ఉన్నాయి. బెల్‌తరోడా కేంద్రంలో 12 వేల బ్యాగులకు 6 వేల బ్యాగులు తీసుకువెళ్లగా మరో 6 వేల బ్యాగులు అక్కడే ఉన్నాయి.

గన్నీ సంచుల కొరత..

మొక్కజొన్న బస్తాలు తరలించేందుకు సకాలంలో లారీలు రాక, గన్నీ సంచులు లేక అధికారులు కొనుగోళ్లు తాత్కలికంగా నిలివేశారు. సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరుతున్నారు.

తక్కవ ధరకు ప్రైవేటుకు..

ఈ ఏడాది మండలంలో మొత్తం 6,500 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశారు. నీటి వసతి ఉండడంతో మంచి దిగుబడి వచ్చింది. అయితే పంట అమ్ముకోవడంలో నానా ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులు కేంద్రాల్లో రైతులు పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వ కింటాల్‌కు రూ.2400 చెల్లిస్తుండగా, ప్రైవేటు వ్యాపారులు రూ.1,700 వందలకే కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement