ఆయిల్‌పామ్‌ సాగువిస్తీర్ణం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పామ్‌ సాగువిస్తీర్ణం పెంచాలి

May 6 2026 7:43 AM | Updated on May 6 2026 7:43 AM

● డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్‌

ఖానాపూర్‌: రైతులు సంప్రదాయ పంటలతోపాటు ఆయిల్‌ పామ్‌ వంటి వాణిజ్య పంటలపై దృష్టి సారించి ఆదాయం పెంచుకోవాలని డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ సూచించారు. పట్టణంలో మంగళవారం నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, రుణాలను వినియోగించుకుని ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణాన్ని పెంచాలని రైతులకు పిలుపునిచ్చారు. ప్రత్యామ్నాయ పంటల సాగు ద్వారా రైతులు మెరుగైన లాభాలు పొందవచ్చన్నారు. అవగాహన లేని రైతులకు అధికారులు మార్గదర్శకత్వం ఇవ్వాలని, రైతులకు అండగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు రమణ, స్పందన, రాధ, నాయకులు గాడ్పు సత్యం, చిన్నం సత్యం, గుగ్లావత్‌ రాజేందర్‌నాయక్‌, యూసుఫ్‌ఖాన్‌, పోలంపల్లి రమేశ్‌, గొర్రె గంగాధర్‌, మదిరె సత్యనారాయణ, ద్యావతి రాజేశ్వర్‌, పోలంపెల్లి సచిన్‌, ఆత్రం అర్జున్‌, అంకుశ్‌రావు, శేషాద్రి, దాసరి రాజన్న, గోల్కొండ ధర్మరాజు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement