సంప్రదాయానికే పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

సంప్రదాయానికే పెద్దపీట

May 6 2026 7:43 AM | Updated on May 6 2026 7:43 AM

నిర్మల్‌ఖిల్లా: ఉమ్మడి ఆదిలాబాద్‌ ప్రాంతంలోని లంబాడా(బంజారా) గిరిజనుల జీవన విధానం అత్యంత సరళంగా ఉన్నప్పటికీ, వారి ఆచారాలు, సంప్రదాయాలు మాత్రం లోతైన అర్థం కలిగి ఉంటాయి. ఈ సంప్రదాయాలు వారి పండుగల్లో, ముఖ్యంగా వివాహ వేడుకల్లో అద్భుతంగా ప్రతిబింబిస్తాయి. తాజాగా నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం కౌట్ల(బి) శాంతినగర్‌ తండాలో జరిగిన వివాహ వేడుక, లంబాడా సంస్కృతిలోని ప్రత్యేకతను మరోసారి చాటిచెప్పింది. వివాహానికి ముందు రోజు నిర్వహించే ’టీలా’ వేడుకలో వరుడి అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒక వీరుడిలా ముస్తాబైన వరుడు, కుడిచేతిలో కటారిని, దాని చివరన లంబాడా సంస్కృతిని ప్రతిబింబించే బట్టతో చేసిన తొడుగు, నిమ్మకాయను పట్టుకుంటాడు. మరో చేతిలో కత్తిని ధరించి, సంప్రదాయ దుస్తుల్లో వరుడు కనిపించడం వారి పూర్వీకుల నుంచి వస్తున్న గొప్ప వారసత్వానికి నిదర్శనం. ఆధునిక కాలంలో జీవనశైలి మారుతున్నప్పటికీ, తమ మూలాలను, ఆచారాలను నేటికీ అత్యంత భక్తిశ్రద్ధలతో కాపాడుకుంటున్నామని గిరిజన నాయకులు సీతారాంనాయక్‌, రాథోడ్‌ సాధుసింగ్‌ గర్వంగా తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement